Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Green card : అమెరికా సంచలన ప్రకటన, గ్రీన్ కార్డుతో శాశ్వత నివాసం వచ్చిన ట్టు కాదు

Green card : ప్రజా దీవెన, అమెరికా: అమెరికాలో గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన శాశ్వత నివాసం వచ్చి నట్టు కాదని అమెరికా ఉపాధ్య క్షుడు జేడీ వాన్స్ సంచలన ప్రకటన చేశారు. గ్రీన్ కార్డు వచ్చినంత మా త్రాన ఎల్లకాలం అమెరికాలో ఉండే హక్కు ఉండదన్న వాన్స్ స్పష్టం చేశారు. ఇది దేశ భద్రతకు సంబం ధించిన అంశమని వ్యాఖ్యానిం చారు. తమలో ఎవరిని విలీనం చేసుకోవాలో అమెరికన్లు నిర్ణయి స్తారని ఆయన చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. అమెరికాకు వెళ్లే ప్రతి ఒక్కరి కల అక్కడి గ్రీన్ కార్డు సాధించడమే. గ్రీన్ కార్డు వస్తే అమెరికా పౌరస త్వం లభిస్తుంది. దీంతో, అమెరికా పౌరులుగా అక్క డే సెటిల్ కావచ్చు, అయితే, అమె రికా గ్రీన్ కార్డు పై ఆ దేశ ఉపాధ్య క్షుడు జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్య లు చేశారు. గ్రీన్ కార్డు పొందినంత మాత్రాన ఎల్లకాలం ఇక్కడ ఉండ పోయే హక్కు ఉండదని చెప్పారు.

ఇది వాక్ స్వాతంత్ర్యానికి సంబం ధించిన అంశం కాదని దేశ భద్రతకు సంబంధించిన అంశమని అన్నారు. అమెరికా పౌరులుగా తమలో ఎవ రిని విలీనం చేసుకోవాలో అమెరిక న్లు నిర్ణయిస్తారని చెప్పారు. అమెరి కా చట్టాల ప్రకారం గ్రీన్ కార్డు పొంది న వ్యక్తి నుంచి కొన్ని సందర్భాల్లో దాన్ని తిరిగి తీసుకోవచ్చు. సుదీర్ఘ కాలం అమెరికాలో లేకపోయినా, నేరాలకు పాల్పడినా, వలస నిబం ధనలు పాటించడంలో విఫలమైనా గ్రీన్ కార్డును వెనక్కి తీసుకునే అవ కాశం ఉంది.