–టాప్–10లో ర్యాంకుల్లో 9 మంది పురుష అభ్యర్థులే
–మొత్తం 2,49,557 మంది జన రల్ ర్యాంకుల ప్రకటన
–అత్యధిక మార్కులు 339 (75. 38%)తో ప్రథమ ర్యాంకు సాధించి న అర్జున్‌రెడ్డి
–యావత్ ప్రక్రియ పారదర్శకమన్న బుర్రా వెంకటేశం
Burra Venkatesham : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీ పీఎస్సీ) పోటీ పరీక్షల ఫలితాలు విడుదల చేసింది. వెలువడిన ఫలి తాల్లో పురుషుల హవా జోరుగా కొనసాగుతోంది. గ్రూప్–3 పరీక్ష ఫలితాల్లోనూ వారే టాపర్లుగా నిలవగా గతేడాది నవంబరు 17, 18వ తేదీల్లో నిర్వహించిన గ్రూప్ –3 ఫలితాలను టీజీపీఎస్సీ శుక్ర వారం ప్రకటించింది. వివిధ ప్రభు త్వ శాఖల్లో మొత్తం 1388 పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహించిన ఈ పరీక్షకు మొత్తం 5,36,400 మం ది దరఖాస్తు చేసుకోగా 2,67,921 మంది అన్ని (3) పేపర్లకు హాజర య్యారు. వీరిలో 18,364 మందిని ఇన్‌వ్యాలీడ్‌గా ప్రకటించారు. మిగ తా 2,49,557 మంది జనరల్ ర్యాంకింగ్ వివరాలను కమిషన్ విడుదల చేసింది. అలాగే టాప్ –10 జనరల్ ర్యాంకులు, టాప్ –10 మహిళా ర్యాంకులను విడు దల చేశారు. టాప్–10 జనరల్ ర్యాంకింగ్స్‌లో తొమ్మిది మంది పు రుషులుండగా, ఒక్కరే మహిళ ఉన్నారు. మొత్తం 450 మార్కుల కుగాను 339.239 (75.38 శాతం) మార్కులు సాధించి కుకునూరి అ ర్జున్‌రెడ్డి టాపర్‌గా నిలిచారు. గత జనవరిలో ఈ పరీక్ష ప్రిలిమనరీ కీ విడుదల చేయగా అందులో అ భ్యర్థుల నుంచి స్వీకరించిన అభ్యం తరాలపై నిపుణుల అభిప్రాయాలు సేకరించామని టీజీపీఎస్సీ తెలి పింది. జనరల్ ర్యాంకింగ్స్ నుంచి అభ్యర్థులను ఎంపిక చేసి ధ్రువ పత్రాల పరిశీలనకు పిలుస్తామని కమిషన్ కార్యదర్శి పేర్కొన్నారు. కాగా, గ్రూప్–3 పరీక్ష, సమాధాన పత్రాల పరిశీలన, ఫలితాల వెల్లడి ని అత్యంత పారదర్శకంగా నిర్వ హించామని కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. పరీక్ష రాసిన అభ్యర్థుల మాస్టర్ క్వశ్చన్ పేపర్ తోపాటు ఓఎంఆర్ షీట్లను వ్యక్తిగ త లాగిన్‌లో అందుబాటులో ఉం చామని, వీటిని ఏప్రిల్ 12 వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అన్నారు. వెబ్‌సైట్‌లో ఏవైనా సాంకేతిక సమ స్యలు ఎదురైతే కార్యాలయ పని వేళల్లో ఫోన్ 040–23542185, 23542187 నంబర్లలో సంప్ర దించవచ్చని అధికారులు సూ చించారు.
టాపర్ మెదక్ జిల్లా వాసి….
గ్రూప్–3 ఫలితాల్లో 339.239 మార్కులతో టాపర్‌గా నిలిచిన కు కునూరి అర్జున్‌రెడ్డి ఇటీవల విడు దలైన గ్రూప్–2 ఫలితాల్లోనూ 18 వ ర్యాంకు సాధించారు. తండ్రి న రేందర్‌రెడ్డి గ్రంథాలయంలో లైబ్రేరి యన్‌గా పనిచేస్తుండగా అర్జున్‌రెడ్డి అదే గ్రంథాలయంలో పరీక్షలకు సన్నద్ధమయ్యారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలానికి చెందిన అర్జున్‌రెడ్డి పదో తగరతి వరకు మెదక్‌లోని సరస్వతీ శిశుమం దిర్‌లో చదివారు. ఇంటర్మీడియట్ హైదరాబాద్‌లోని నారాయణ కళా శాలలో, 2013లో బీటెక్ పూర్తి చే శారు. 2014లో వీఆర్వో ఉద్యోగా నికి ఎంపికయ్యారు. పదోన్నతి పొం దిన ఆయన ప్రసుత్తం మెదక్ కలెక్ట రేట్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. కాగా, చిన్నప్పటి నుం చి కలెక్టర్ కావాలని ఉందని, ఆ మేరకే గ్రూప్స్ వైపు అడుగులు వేశానని అర్జున్‌రెడ్డి తెలిపారు. సివిల్స్‌లో విజయం సాధించడమే లక్ష్యమన్నారు. అదేవిధంగా 7వ ర్యాంకు సాధించిన చంద్రకాంత్ రంగారెడ్డి జిల్లాకు చెందినవాడు. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మం డలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రైతుబిడ్డ ఒగ్గు చంద్రకాంత్ గ్రూప్ –3 ఫలితాల్లో 7వర్యాంకు సాధిం చారు. చంద్రకాంత్ ఇప్పటికే నాలు గు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక య్యారు. గ్రూప్–2, గ్రూప్–4 ఫలి తాలు రెండింట్లోనూ 27వ ర్యాంకు సాధించిన చంద్రకాంత్ జూనియర్ లెక్చరర్ ఫలితాల్లో మూడవ ర్యాం కర్‌గా నిలిచారు. తాజాగా గ్రూప్– 3లో ర్యాంకుతో వరుసగా ఐదో ప్ర భుత్వ ఉద్యోగం సాధించారు. ఇది లా ఉండగాసిద్దిపేటకు చెందిన వడ్ల కొండ సచిన్ గ్రూప్–3 ఫలితాల్లో 317 మార్కులతో 23వ ర్యాంకు సాధించారు. ఇప్పటికే ఆయన గ్రూప్–2 ఫలితాల్లో 2వ ర్యాంకుతో సత్తా చాటారు.
మళ్లీ మెరిసిన గిరిజన ఆణి ముత్యం …టీజీపీఎస్సీ గ్రూప్స్ పరీక్షల్లో వరుసగా నాలుగోసారి సత్తా చాటాడు ఓ సామాన్య గిరిజన యువకుడు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నల్లచెరువు తండాకు చెందిన దేవేందర్‌నాయక్.. గ్రూప్–3 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 63వ ర్యాంకు, ఎస్టీ కేటగిరీలో రెండో ర్యాంకు సాధించారు. ఇప్పటికే గ్రూప్–4లో ఉద్యోగం సాధించి శంషాబాద్ తహసీల్దార్ కా ర్యాలయంలో జూనియర్ అసి స్టెంట్‌గా విధుల నిర్వహిస్తున్న దే వేందర్‌నాయక్ ఇటీవల ప్రకటిం చిన గ్రూప్–1 ఫలితాల్లో 433 మార్కులు సాదించారు. గ్రూప్–2 పలితాల్లో 171వ ర్యాంకు పొందారు.