Holi celebrations : ప్రజాదీవెన చిట్యాల : రంగుల పండగ హోలీని పురస్కరించుకొని ఎంపియల్ పరిశ్రమయాజమాన్యానికి, ఎంపియల్ పరిశ్రమ మిత్ర బృందానికి జిఎం సదన్ బాబు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ హోలీ సంబరాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హోలీ పండగ సంతోషం, సంబరమనే సప్తవర్ణాలతో నిండిన ఇంద్రధనస్సు రంగులు పులుముకోవాలని.. మిత్రుల జీవితాలు పాడిపంటలు, ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.హోలీ పండగ సందర్భంగా మిత్రులందరికీ సహజ సిద్ధమైన రంగులను వినియోగిస్తూ..
ఎలాంటి అవాంతరాలు లేకుండా జాగ్రత్తగా హోలీ పండగను జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.హోలీ పండగ సందర్భంగా వేగంగా బైకులు నడపడం, విన్యాసాలు చేయడం వంటివి చేయకుండా స్నేహితులు, కుటుంబసభ్యులతో ఉత్సాహంగా పండగను జరుపుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రామచంద్రయ్య, సంతోష్ ప్రొడక్షన్ మేనేజర్ ఎడ్మిన్ హెచ్ ఓ డి తివారి, జోహార్, అచ్చయ్య, డెబిట్, రాహుల్, మోహన్, వినయ్, సాగర్ల నరేష్, తదితరులు పాల్గొన్నారు.