Food Doination : ప్రజా దీవేన, కోదాడ: పట్టణంలోని స్థానిక చనగల రాధాకృష్ణ మానసిక దివ్యాంగుల కేంద్రంలో శుక్రవారం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు మిట్టపల్లి నరసింహారావు కాంతామణి దంపతుల 31 వ పెళ్లి రోజు సందర్బంగా, దివ్యాంగులకు అల్పాహార పంపిణీ చేశారు కోదాడ వాసవి క్లబ్ అధ్యక్షులు. అధ్యక్షులు సేకు శ్రీనివాసరావు మాట్లాడుతూ దాతను,వారి కుటుంబ సభ్యులను అభినందిచారు.
ఇట్టి కార్యక్రమం లో వాసవి క్లబ్ అధ్యక్షులు సేకు శ్రీనివాసరావు,సెక్రటరీ, పత్తి నరేందర్,కోశాధికారి వెంపటి ప్రసాద్ , వాసవి క్లబ్ ఉపాధ్యక్షులు చుండూరు నాగమల్లేశ్వరరావు,ఆర్ ఎస్ రీజియన్( 9) బండారు శ్రీనివాసరావు, దాత మిట్టపల్లి నరసింహారావు ,కాంతామణి కుటుంబ సభ్యులు మిట్టపల్లి సాయి శ్రీనివాస్, లావణ్య దంపతులు,సేకు సాయిరాం రమ్య దంపతులు మరియు ఆశ్రమ సిబ్బంది పాల్గొన్నారు.