Calendar Launched : ప్రజా దీవెన శాలిగౌరారం : శాలిగౌరారం మండలంలోని వల్లాల గ్రామంలోని శ్రీ పార్వతీ శంభు లింగేశ్వర స్వామి ఆలయంలో ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో వావిలాల వారి “విశ్వావసునామ” పంచాంగం ను ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ధూప దీప నైవేద్య అర్చక సంఘం జిల్లా కార్యదర్శి రామడుగు వెంకట్రామ శర్మ ముఖ్య అతిధిగా హాజరైయ్యారు.
ఈ కార్యక్రమం లో వావిలాల వేణునాథ శర్మ, వావిలాల రామలింగయ్య శర్మ, వెంకటేశ్వర శర్మ, ప్రశాంత్ శర్మ, లక్ష్మి నరసయ్య శర్మ,తల్పసాయి శాస్త్రి, శేషం నరసింహాచార్యులు, శేషం రత్నమాచార్యులు, వావిలాల లక్ష్మీప్రసాద్, వావిలాల నాగఫణి శర్మ తో పాటు తదితరులు పాల్గొన్నారు.