–పొలిటికల్ సైన్స్ అధ్యాపకులు శ్రీనివాస్, లా ఫ్యాకల్టీ ధనలక్ష్మి
–అరోరా లా కాలేజీలో ఘనంగా ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం
Consumer Rights : ప్రజాదీవెన , నల్లగొండ : ప్రతి ఒక్కరు కూడా వినియోగదారుల హక్కులు తెలుసుకోవాలని, హక్కుల కోసం పోరాటం చేయాలని పొలిటికల్ సైన్స్ అధ్యాపకులు శ్రీనివాస్, లా ఫ్యాకల్టీ ధనలక్ష్మి పేర్కొన్నారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని అరోరా లా కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
అనంతరం మరో లా ఫ్యాకల్టీ నాగేందర్ మాట్లాడుతూ ఐఎస్ఐ, హాలో మార్క్, అగ్ మార్క్ గూర్చి తెలుసుకోవాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం కొంత మంది విద్యార్థులు వారి అనుభవాన్ని మిగతా విద్యార్థులతో పంచుకోగా ఇంకొంత మంది విద్యార్థులు వినియోగదారుల హక్కుల ప్రాముఖ్యత ను వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది వెంకట్, రాజు, పాష తదితరులు పాల్గొన్నారు.