Road Accident : ప్రజా దీవెన, కూకట్ పల్లి: హైదార బాద్ నగరంలో కేపి.హెచ్.బి పోలీ స్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కెపి హెచ్ బి లోని హైదర్ నగర్ వద్ద ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. మెట్రో పిల్లర్ నెంబర్ ఏ 681 వద్ద ద్విచక్ర వాహనాన్ని కంటైనర్ లారీ ఢీకొట్ట డంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృ తి చెందాడు.
ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన వ్యక్తి తలపై నుండి లారీ వెళ్లడంతోనే ఆ వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు వెల్లడించారు. ప్రమాదం చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ భారీగా ఏర్పడింది.
స్థానికు లు వెంటనే పోలీసులకు సమాచా రం అందించడంతో సంఘటన స్థ లానికి చేరుకొని దర్యాప్తు చేపట్టా రు. మృతి చెందిన వ్యక్తి ఫణి రం జన్(45) గుర్తించారు తను సుమి త్ డిజిటల్ ఉద్యోగిగా విధులు ని ర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.