Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

GST Notices : చిత్ర విచిత్రాలు, దినసరి కూలీకి జీ ఎస్టీ నోటీసులు

GST Notices : ప్రజా దీవెన, భద్రాద్రి కొత్తగూడెం: దేశం లో చిత్ర విచిత్రాలు జరగడం కొత్త విషయమేమీ కాదు. కానీ అ ప్పుడప్పుడు ఎటువంటి విచిత్ర మైనా ఎక్కడో చూసినట్లు ఉన్న ప్ప టికీ అప్పుడప్పుడు కొత్తగా అని పించడం సర్వ సాధారణం అయి పోయింది. ఈ క్రమంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తాజాగా ఓ చిత్రం విచిత్ర విశేషాలు వెలుగు చూశాయి. భద్రాద్రి కొత్తగూడెం జి ల్లా చండ్రుగొండ గ్రామంలో సా ధా రణ వ్యవసాయ కూలీకి రూ. 22 లక్షల జీఎస్టీ చెల్లించాలంటూ నోటీ సు జారీ అయ్యింది.ఇటీవల పోస్టు ద్వారా అందిన నోటీసు చూసి ఆ కూలీ బిత్తరపోయాడు.

చండ్రుగొండకు చెందిన జానపాటి వెంకటేశ్వ ర్లు కూలి పనులు చేస్తాడు. అతడి కి ఈ నెల 4న జీఎస్టీ నోటీసు అం దింది. తనకు చదువు రాకపోవ డంతో ఆ నోటీసును తెలిసిన వా రికి చూపగా షాకింగ్ విషయం బ యటపడింది.విజయవాడ బెంజ్ సెంటర్ లోని కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయం నుంచి నోటీసు వచ్చినట్లు చెప్పారు. విజయలక్ష్మి ఎంటర్ ప్రైజస్ పేరుతో కోటి రూ పాయల విలువైన గ్రానైట్ బిజినెస్ చేశారని, 2022 ఏడాదిలో చేసిన ఈ వ్యాపారానికి జరిమానాతో కలి పి మొత్తం జీఎస్టీ 22 లక్షల 86వేల 14 రూపాయలు బకాయిపడ్డట్లు నోటీసులో పేర్కొన్నారు.

దీంతో వెం కటేశ్వర్లు విజయలక్ష్మి ఎంటర్ ప్రై జస్ ఎవరిదో కనుక్కోవడానికి ఈ నెల 12న విజయవాడ వెళ్లాడు. అ యితే, ఆ అడ్రస్ లో అసలు కార్యా లయమే లేదని తేలడంతో తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు. 2022లో అతడికి పాన్ కార్డ్ కూడా లేదు. 6 నెలల క్రితమే చండ్రుగొండలోని మీ-సేవ కేంద్రానికి పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేయడానికి వెళ్తే ఆ పేరు, ఆధార్ నెంబర్ తో అప్పటికే పాన్ కార్డ్ జారీ అయ్యిందని చెప్పా రు.

అయితే, వెంకటేశ్వర్లు ఆధార్ కార్డ్ అక్రమార్కుల చేతికి ఎలా వెళ్లింది, ఆయన పేరుతో వ్యాపార లైసెన్స్ తీసుకుంది ఎవరు, అనేది తేలాల్సి ఉంది. రెక్కాడితే కాని డొ క్కాడని తనకు ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో అర్థం కావ డం లేదని బాధితుడు వాపోయాడు. దీనిపై అధికారులు సమగ్ర విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు. సంబంధిత అధికారులు ఏమి చేస్తారో వేచి చూడాల్సి వస్తుంది.