Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister Uttam Kumar Reddy : ఉద్యోగుల విశ్రాంత ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం

*నేను ఒక విశ్రాంత ఉద్యోగినే….

*ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఒకటో తేదీనే పెన్షన్, జీతాలు ఇస్తున్నామ్

*15 నెలల్లో 55 వేల ఉద్యోగాలు భర్తీ చేయలెదు

*రాష్ట్రస్థాయి క్రీడా సాహిత్య సాంస్కృతిక పోటీలు నిర్వహించడం గర్వకారణం. మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి..

Minister Uttam Kumar Reddy : ప్రజా దీవేన,కోదాడ:కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల విశ్రాంతి ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలోని పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో కోదాడ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి క్రీడా సాహిత్య సాంస్కృతిక ఉత్సవాల ప్రారంభ సమావేశంలో ఎంపీ రఘువీరారెడ్డి తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు విశ్రాంత ఉద్యోగులంతా తమ కుటుంబ సభ్యులైన అన్నారు తాను ఒక విశ్రాంతి ఉద్యోగినేనని తనకు కూడా సంఘంలో సభ్యత్వం ఇవ్వాలన్నారు గత ఎన్నికల్లో విశ్రాంత ఉద్యోగుల సంఘం కాంగ్రెస్ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించిందని విశ్రాంత ఉద్యోగులకు రుణపడి ఉంటామన్నారు విశ్రాంత ఉద్యోగుల డిమాండ్లన్నీ న్యాయమైనవేనని పరిష్కరించేందుకు తప్పకుండా కృషి చేస్తానన్నారు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్న ప్రతినెల మొదటి తేదీనే పెన్షన్ జీతాలు అందిస్తున్నామన్నారు గత ప్రభుత్వంలో పింఛన్దారులు పింఛన్ కోసం ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో 55 వేల పోస్టులు భర్తీ చేశామని 11 టీచర్ పోస్టులు నింపామన్నారు గత పది ఏళ్లలో టీచర్ల ప్రమోషన్లు బదిలీలు జరగలేదని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీనియారిటీ ఆధారంగా ఎటువంటి పైరవీలు లేకుండా పారదర్శకంగా పదోన్నతులు బదిలీలు చేశామన్నారు అన్ని శాఖల్లో పదోన్నతులు బదిలీలు పారదర్శంగా చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం దేని అన్నారు మూడు దశాబ్దాల పాటు ప్రజలకు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపుని ఇస్తుందన్నారు గత మూడు దశాబ్దాల నుండి కోదాడ హుజూర్నగర్ నియోజకవర్గ ప్రజల గుండెల్లో స్థానం కల్పించారని ప్రజలందరికీ రుణపడి ఉంటామన్నారు విశ్రాంత ఉద్యోగుల హెల్త్ కార్డు సమస్య న్యాయమైనదేనని మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో చర్చించి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనాలకు నిధులు మంజూరు చేస్తామన్నారు.

 

60 ఏళ్లు నిండిన మీలో ఉన్న ఉత్సాహం చూసి తాను ఆశ్చర్యపోతున్నానని రాష్ట్రస్థాయిలో క్రీడలు నిర్వహించి అందరికీ విశ్రాంత ఉద్యోగులు ఆదర్శంగా నిలుస్తున్నారని కొని ఆడారు మరో ముఖ్యఅతిథి ఎంపీ రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో తనకు సంపూర్ణ మద్దతు ఇచ్చి రికార్డు స్థాయి మెజారిటీతో గెలిపించారని విశ్రాంత ఉద్యోగుల సమస్యలను మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి సహకారంతో పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు అనంతరం తన నిధుల నుండి గరి డే పల్లి విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనానికి 5 లక్షల నిధులు కేటాయించారు అంతకుముందు విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ డా. సుధాకర్ మాట్లాడుతూ భారతదేశంలోనే తొలిసారిగా కోదాడలో విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు జరుగుతున్నాయని అదేవిధంగా పెన్షనర్ల పితామహుడు నకారే విగ్రహం కూడా కోదాడ విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయంలోనే ఏర్పాటు చేశారని ఇవి చారిత్రాత్మకంగా నిలిచిపోతాయన్నారు. ప్రభుత్వం తమ సమస్యలకు పరిష్కారానికి రాష్ట్ర సంఘంతో చర్చలు జరిపి పరిష్కరించేందుకు కృషి చేయాలి అన్నారు రాష్ట్రవ్యాప్తంగా 90 లక్షల మంది రిటైర్డ్ ఉద్యోగులు ప్రభుత్వానికి అండగా ఉంటారన్నారు క్యాష్ లెస్ హెల్త్ కార్డుల సమస్య పరిష్కరించాలని, హెల్త్ కార్డుల కోసం వన్ పర్సెంట్ చెల్లించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెళ్ల సీతారామయ్య మాట్లాడుతూ అందరి సహకారంతో రాష్ట్రస్థాయిలో మూడు రోజులపాటు కోదాడలో క్రీడా సాంస్కృతిక సాహిత్య ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల నుండి విశ్రాంత ఉద్యోగులు భారీగా తరలివచ్చారు రావెళ్ల సీతారామయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు వంగవీటి రామారావు ,టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీనారాయణ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బషీర్ ,విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దామోదర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి ప్రధాన కార్యదర్శి బొల్లు రాంబాబు, క్లబ్ అధ్యక్షులు పట్టాభి రెడ్డి వెనేపల్లి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. సమావేశానంతరం ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి