*కోదాడ విశ్రాంత ఉద్యోగుల క్రీడా సాంస్కృతిక పోటీలు ఆదర్శనీయం
*విద్యా ,వైద్యం, మౌలిక సదుపాయాలు సమాజానికి ఎంతో అవసరం.
* విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చేస్తా….. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
Minister Tummala Nageswara Rao :ప్రజా దీవేన,కోదాడ:కోదాడ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో క్రీడా సాహిత్య సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించడం ప్రశంసనీయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు ఆదివారం కోదాడ పట్టణంలో పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో కోదాడ విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ సీతారామయ్య నాయకత్వం నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి క్రీడా సాహిత్య సంస్కృతిక ఉత్సవాల ప్రారంభ సభ సమావేశంలో మంత్రిముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ప్రస్తుత పరిస్థితుల్లో యువత కానీ పెద్దవాళ్లు కానీ క్రీడలకు సమయం కేటాయించే పరిస్థితుల్లో లేరన్నారు. గతం లో ఎమ్మెల్యేలకు కూడా క్రీడా పోటీలు ఉండేవని ప్రస్తుతం సమయం లేక క్రీడలు ఆడ లేకపోతున్నామని చెప్పారు.ఇటువంటి పరిస్థితుల్లో కోదాడ విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్రస్థాయిలో క్రీడా సాహిత్య సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించడం ఆదర్శనీయమన్నారు.
ఉద్యోగులుగా సమాజానికి మూడు నాలుగు దశాబ్దాలు సేవలందించి ఉద్యోగ విరమణ అనంతరం కుటుంబ సభ్యుల ఎడబాటు నుండి ఉపశమనం పొందేందుకు ఈ ఉత్సవాలు ఎంతో దోహద పడతాయన్నారు. ఆప్యాయత ప్రేమాభిమానాలు ఉన్న ఉద్యోగ చదువుల రీత్యా పిల్లలు తమతో ఉండే పరిస్థితి లేదన్నారు. గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా రోడ్డు రవాణా శాఖ మంత్రిగా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేశానన్నారు.కోదాడ జడ్చర్ల, కోదాడ, ఖమ్మం,కొరివి రహదారుల ఏర్పాటుకు కృషి చేశానన్నారు.సమాజానికి విద్య వైద్యం తో పాటు, మౌళిక సదుపాయాలు ఎంతో ఆవశ్యకం అన్నారు. ఉచిత పథకాలు అర్హులకే ఇవ్వలనేది తన అభి ప్రాయం అన్నారు. బడ్జెట్ సమావేశాల అనంతరం విశ్రాంత ఉద్యోగుల రాష్ట్ర నాయకులతో సమావేశం ఏర్పరిచి అవసరమైతే ముఖ్యమంత్రితో మాట్లాడి సమస్యలన్నిటినీ పరిష్కరిస్తానన్నారు. సమాజం లో విశ్రాంత ఊద్యోగుల పాత్ర ఎంతో కీలకం అన్నారు. విశ్రాంత ఉద్యుగుల పై అభిమానం తో ఎన్ని పనులు ఉన్న వదులుకొని సమావేశానికి వచ్చానన్నారు.ఉద్యోగుల, విశ్రాంత ఉద్యోగుల శక్తి ని తక్కువ అంచనా వేస్తే ఎక్కడ ఉంటారో తెలుస నీ విశ్రాంత ఉద్యోగుల సలహాలు సూచ తప్పకుండా పరిగణ లోకి తీసుకుంటామన్నారు. కాగ రాష్ర్ట అధ్యక్షులు దామోదర్ రెడ్డి, ఆల్ ఇండియా పెన్షర్స్ సమాఖ్య జనరల్ సెక్రటరీ డాక్టర్ సుధాకర్ విశ్రాంత ఉదోగుల హెల్త్ కార్డులు, పీఆర్సీ, డీఏ లు , ఇతర సమస్యలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ర్ట ఉపాధ్యక్షులు రావెళ్ళ సీతారామయ్య అద్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వెనేపల్లి చందర్ రావు, డీసీసీ బి మాజీ చైర్మెన్ ముత్త్వరపు పాండురంగారావు, రాష్ట్ర జనరల్ సెక్రెటరీ చంద్ర శేఖర్ ,జిల్లా అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి ప్రధాన కార్యదర్శి బొల్లు రాంబాబు, ఖమ్మం జిల్లా అద్యక్షులు ఎర్నేని రామారావు, వేనే పల్లి శ్రీని వాస్, క్లబ్ అధ్యక్షుడు పట్టాభి రెడ్డి అన్ని జిల్లా ల అధ్య క్ష కార్య ధర్షులు, మండల బాద్యులు ఉన్నారు.