FamilySuicide: ప్రజా దీవెన, సిద్దిపేట: రెక్కాడితే కానీ డొక్కా డని కుటుంబం వారిది కూలీ పనులు చేసుకుంటనే నాలు గు వేళ్లు నోట్లోకి పోయే పరిస్థితి. దీ నికి తోడు నలుగురు పిల్లల పోషణ మరిం త భారంగా మారింది. దీం తో కుటుంబంలో కలహాలు మొదల య్యా యి. కలహాల కారణంగా మ నస్తాపంతో భార్య ఆత్మహత్యకు పాల్ప డింది. చికిత్స పొందుతూ ఆ మె మరణించిందనే వార్త విన్న కాసే ప టికే ఆమె భర్త కూడా బలవన్మర ణానికి పాల్పడ్డాడు. దీంతో నలు గురు పిల్లలు అనాథలుగా మిగిలారు.
ఈ హృదయవిదారక ఘ టన సిద్దిపేట జిల్లా తొగుట మం డలంలోని ఎల్లారెడ్డిపేట గ్రామంలో ఆదివారం జరిగింది. స్థానికుల కథనం ప్రకా రం తొగుట మండలం ఎల్లారెడ్డిపేటకు చెందిన కెమ్మసారం నాగరాజు (40)కు పదేళ్ల కిందట రే ణుకతో వివాహమై ఇద్దరు పిల్లలు కలిగా రు. ఆరేళ్ల క్రితం కుటుంబ కలహాలతో ఆమె ఉరేసుకొని ఆత్మ హత్య చేసుకుంది. భాగ్యలక్ష్మి (35) తో నాగరాజుకు రెండో వివాహం జరి గింది.
వీరికి ఇద్దరు పిల్లలు లక్ష్మీ, శ్రావణ్ జన్మించారు. నాగరాజు కుటుంబం స్థానికంగా ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇంట్లో నివాసముం టోంది. కూలీపనులు చేసుకుని నాగరాజు భార్యా బిడ్డలను పోషిం చుకుంటున్నాడు.అయితే ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో భాగ్య ఆది వారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో తమ ఇంట్లోనే పురు గుమందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన ఇరుగు పొరుగు ఆమెను సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా భాగ్య అప్ప టికే చనిపోయిం దని వైద్యులు చెప్పారు.
అప్పటిదా కా అక్కడే ఉన్న నాగరాజు భార్య మరణవార్త విన్న వెంట నే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాసేపటికి తన కుటుంబీకులకు ఫో న్ చేసి తా ను కూడా పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుం టున్నానని చెప్పి కట్ చేశాడు. కుటుంబసభ్యు లు పోలీసులకు స మాచారం ఇవ్వగా నాగరాజు సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీ సులు అతడు ఉన్న లొకేషన్ కు వెళ్లారు.
సిద్దిపే టలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి సమీ పంలోని చెట్ల మధ్య అచేత నంగా పడి ఉన్న నాగరాజును రాత్రి ఎని మిది గంటలప్పుడు గుర్తిం చారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తర లించారు. కేసు నమోదు చేసిన తొ గుట పోలీసులు దర్యాప్తు చేస్తున్నా రు. తల్లిదండ్రులను కోల్పోయి న లుగురు పిల్లలు అనాథలు కావడం తో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కాగా, తల్లిదండ్రుల మరణంతో అనాథలుగా మా రిన చిన్నారులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతు న్నారు.