–హాస్టల్ విద్యార్థుల సమస్యలు బయటికి రాకుండా అడ్డుకునే ప్రయత్నమా?
–అన్యాయాన్ని సమర్థించినట్లుగా కలెక్టర్ ఆదేశాలు
–కలెక్టర్ ను తప్పుదోవ పట్టించారంటూ విద్యార్థి సంఘాల ఆగ్రహం
–ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్
–ప్రజా పాలన అంటే ఇదేనా అంటూ సూటి ప్రశ్న
— నేడు కలెక్టరేట్ వద్ద ధర్నాకు విద్యార్థి సంఘాల పిలుపు
–సంక్షేమ హాస్టళ్ల జిల్లా అధ్యక్ష కార్యదర్శులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్
collector’s orders : ప్రజాదీవెన నల్గొండ : ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు అధ్వానంగా మారాయి. ప్రభుత్వం వెంటనే దృష్టిసారించాలి. హాస్టళ్ల నిర్వహణ కొరవడటంతో .. నాణ్యమైన భోజనం అందడటంలేదు. కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందొ అర్థం చేసుకోవాలని ఓ శాసనసభ్యుడు అసెంబ్లీ సాక్షిగా హాస్టల్లోని విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయిన, ఆత్మహత్యాయత్నానికి పాల్పడినా విషయాన్ని బయటకి రానివ్వడం లేదు. ఏ హాస్టల్ కి వెళ్ళినా ఫుడ్ పాయిజన్, సిబ్బంది సక్రమంగా ఉండక సౌకర్యాలు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. చివరకు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన పట్టించుకునే నాధుడు లేడని ఆయన ఆవేదన చెందుతూ ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. ఇలాంటి పరిస్థితులు ఎన్నో ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో తిష్ట వేసి కూర్చున్నాయి. ఇలాంటి పరిస్థితులలో కూడా విద్యార్థి సంఘాలు, మీడియా ఓ కన్నేసి ఉండడంతోనే అంతో.. ఇంతో విద్యార్థులకు న్యాయం జరుగుతుందన్నది వాస్తవం. అయితే ఈ తరుణంలోనే విద్యార్థి సంఘాల ను హాస్టల్లోకి అనుమతించకుండా గత 15 వ తేదీన నల్లగొండ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులను జారీ చేయడం జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం చర్చనీఅంశమైంది. ఈ నిర్ణయం పట్ల విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సంక్షేమ శాఖ వసతి గృహాల అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు జిల్లా కలెక్టర్ ను తప్పదోవ పట్టించి ఉత్తర్వులను జారీ చేయించారంటూ విద్యార్థి సంఘ నాయకులు మండిపడుతున్నారు. విద్యార్థి సంఘాలను హాస్టల్లోకి అనుమతి ఇవ్వకపోతే అసలు హాస్టల్లో ఏం జరుగుతుందో బయటకు ఎలా తెలుస్తుందని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా జిల్లా కలెక్టర్ విద్యార్థి సంఘాలకు హాస్టల్లోకి అనుమతి లేదంటూ ఉత్తర్వులు జారీ చేయడం వెనకాల మర్మం ఏంటో అర్థం కావటం లేదని,
అన్యాయాన్ని సమర్థించినట్లుగా కలెక్టర్ ఆదేశాలు ఉన్నాయంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ శాఖ హాస్టల్ల అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శి, మరి కొంతమంది వార్డెన్లు కలెక్టర్ ను పక్కదో పట్టించి ఉత్తర్వులను జారీ చేయించినట్లు వారు ఆరోపిస్తున్నారు. విద్యార్థి సంఘాలను హాస్టల్లోకి అనుమతించకపోతే విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఉత్తర్వులను వెనక్కి తీసుకోకపోతే వార్డెన్లు ఆడిందే ఆటగా.. పాడింది పాటగా సాగే పరిస్థితులు కనబడుతున్నాయి. ఏ హాస్టల్ వార్డెన్ విద్యార్థులకు అందుబాటులో ఉండటం లేదు. ఇప్పటికే ఏ ఒక్క హాస్టల్ లో కూడా మెను సక్రమంగా అమలు కావడం లేదు. వీటిపై విద్యార్థి సంఘాలు పోరాడి కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకువెళితే తప్ప ఎంతో కొంత న్యాయం జరుగుతుంది. నేడు ఈ పరిస్థితి లేకపోతే విద్యార్థులకు నాణ్యమైన మెనూ అందించే పరిస్థితి కలగానే మిగిలిపోయే అవకాశం ఉంది. అందువల్ల ఇప్పటికైనా ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఉత్తర్వులు ప్రజాస్వామికం…
రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా సంక్షేమ వసతి గ్రహాలలోకి విద్యార్థి సంఘాలు, ఇతర కుల సంఘాలు రావద్దని సర్క్యులర్ జారీ చేయడం అప్రజాస్వామీకమని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆకారపు నరేష్ కంభంపాటి శంకర్ లు ఆరోపించారు. సంక్షేమ శాఖల వసతి గృహాల అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కలెక్టర్ ను తప్పదో పట్టించి ఉత్తర్వులను జారీ చేయించారని వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నేడు విద్యార్థి సంఘాల తో కలిసి కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్నట్లుఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన అంటు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నే జిల్లా కలెక్టర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, తాసిల్దార్, ఎంపీడీవో, లు నెలకు ఒక్కసారైనా సంక్షేమ హాస్టల్ లో బస చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు గుర్తు చేశారు. గత రెండు నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని కోత్త మెనూ ను అమల్లోకి తీసుకొచ్చింది. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏ ఒక్క హాస్టల్లో కూడా మెను సక్రమంగా అమలు కావడం లేదని ఆరోపించారు. అంతేకాకుండా నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్లో
46 ఎస్సీ జనరల్ హాస్టళ్ళలో వుండే 3326 విద్యార్థుల సంఖ్య,15 కళాశాల హాస్టల్లో 956 మంది విద్యార్థులు, 31 ఎస్టి జనరల్ హాస్టల్లో 6939 మంది విద్యార్థులు,10 కళాశాల హాస్టళ్ళలో సుమారు 1760 మంది, బీసీ హాస్టల్లు 46 ఉండగా వాటి లో సుమారు 8 వేల మంది విద్యార్థులు వసతి పొందుతున్నారని తెలిపారు. అయితే హాస్టల్లో ఉండే విద్యార్థుల సంఖ్య కంటే అధిక సంఖ్యను చూపిస్తూ
ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగిస్తూ విద్యార్థుల మెస్, కాస్మెటిక్ చార్జీలు డ్రా చేస్తున్నారని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక అధికారులతో హాస్టల్లో ఎంక్వైరీ చేయిస్తే వసతి పోందే విద్యార్థుల సంఖ్య ఎంతో స్పష్టం గా తెలుస్తోందని పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలపై ప్రశ్నించే తమను హాస్టల్లోకి వెళ్లకుండా సర్క్యులర్ జారీ చేయించి కలెక్టర్ కూడా బదలం చేయించే ప్రయత్నం చేశారని సంఘ నాయకుల పై మండిపడ్డారు. తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హాస్టల్ వార్డెన్లు ఉద్యోగం రాక ముందు వున్న ఆర్థిక లావాదేవీలు, ప్రస్తుత ఆర్థిక లావాదేవీలపై విచారణ జరిపించాలని, నిజ నిర్థారణ చేసిన తరువాతే సర్కిలర్ విడుదల చేయాలని కలెక్టర్ ను కోరారు.
— ఈ ప్రశ్నలకు బదులేది..
–నల్గొండ పట్టణ కేంద్రంలో వున్నా
కళాశాల హాస్టల్ విద్యార్థులు పంక్షన్ హల్లలో క్యాటరింగ్ కు వెళుతుంటే వార్డెన్లు ఏం చేస్తున్నారు?
–నల్లగోండ జిల్లా వ్యాప్తంగా అన్ని వసతి గృహ అధికారులు స్థానికంగా వుంటున్నారా?
— నల్లగోండ జిల్లా వ్యాప్తంగా మెస్ కాస్మెటిక్ చార్జీలు డ్రా చేస్తున్న ప్రకారం హాస్టల్లో విద్యార్థులు వసతి పోందుతున్నారా?
–నల్లగోండ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం అందించే సివిల్ సప్లయ్ బియ్యం ఆర్వో ల ప్రకారం హాస్టళ్ళ కు చేరుతున్నాయా?
–ప్రభుత్వం అందించే నోట్ బుక్స్, బట్టలు,పెట్టెలు, దుప్పట్లు, ఇతర సామాగ్రి అంతా విద్యార్థుల కు అందుతుందా?
–నల్లగోండ జిల్లా వ్యాప్తంగా హాస్టల్లో కిరాణం సామాను, కూరగాయలు, గుడ్లు, పండ్లు తిసుకునే వివరాలు కలెక్టర్ మేడమ్ కి అందించగలరా?
–నల్లగోండ జిల్లా కేంద్రంలో బాలికల కళాశాల హాస్టల్లో విద్యార్థినిలు మద్యం సేవించి కిందపడి విద్యార్థినిల తలకాయలు పగులుతుంటే వార్డెన్లు కనీసం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళారా?
–నల్లగోండ జిల్లా వ్యాప్తంగా గిరిజన సంక్షేమ హాస్టల్ లో మధ్యాహ్న భోజనం ప్రభుత్వ పాఠశాలలోనే పెడుతున్నారు.కాని హాస్టల్లో అన్నం పెడుతున్నామని గిరిజన సంక్షేమ హాస్టల్ అధికారులు మెస్ బిల్లు డ్రా చేయడం కరెక్టేనా?
–పేద, మధ్యతరగతి విద్యార్థుల నోటి కాడి బియ్యాన్ని అమ్మడం కరెక్టేనా?
–నల్లగోండ పట్టణంలో వార్డెన్ల సంఘం జిల్లా అధ్యక్షునికి దశాబ్ద కాలంగా స్థాన చలనం కాకపోవడానికి గల కారణాలు ఏంటి ?
–ఒక హాస్టల్ నుంచి మరోక హాస్టల్ కి మారడం బదీలీ అంటారా?
–నల్లగోండ జిల్లా వ్యాప్తంగా సంక్షేమ హాస్టల్ లో విద్యార్థుల మరణాలపై తీసుకున్న చర్యలు ఏమిటి?
–గత మూడు నెలలుగా మిర్యాలగూడ, దేవరకొండ, నాగార్జునసాగర్, నకిరేకల్, మునుగోడు, నియోజకవర్గం లో ప్రభుత్వం అందించే మెను విద్యార్థులకు పెట్టడం లేదు. కారణాలు జిల్లా కలెక్టర్ కు చెప్పగలరా ?
–నల్లగొండ జిల్లా వ్యాప్తంగా అన్ని వసతి గృహ అధికారులు ఉదయం, సాయంత్రం హస్టళ్ళ కు వస్తున్నారా?
— వార్డెన్లు సంక్షేమ శాఖల జిల్లా అధికారులు, సహాయ సంక్షేమ శాఖ అధికారులకు పర్సెంటేజి లు ఇవ్వవచ్చా ?
–నల్లగోండ జిల్లా వ్యాప్తంగా హాస్టల్లో ట్యూటర్లను పెట్టకున్నా ట్యూటర్ల బిల్లు లు డ్రా చేయవచ్చా?
–సంక్షేమ వసతి గృహ అధికారులు వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం యూనియన్లలో తిరిగవచ్ఛా?
— హాస్టల్ ఉండే విద్యార్థులకు సంఘాలు అవసరం లేదా?
–నల్లగోండ జిల్లా వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ జనరల్ హాస్టళ్ళలో విద్యార్థుల కు ఇచ్చే యూనిఫాం కుట్టే టైలర్ వద్ద నుండి పర్సంటేజి లను తీసుకోవడం సరైనదేనా ?
–జిల్లాలో సంక్షేమ హాస్టల్లో పనిచేసే వర్కర్లను తమ కుటుంబ అవసరాలకు పోలం పనులకు ఉపయోగించుకోవచ్ఛా?
— హాస్టల్లో ఏలాంటి తప్పులు జరగడం లేదని సంక్షేమ హాస్టల్ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జిల్లా కలెక్టర్ దగ్గర ఒప్పుకుంటారా అని విద్యార్థి సంఘాలు ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తున్నాయి.