Road Accident : ప్రజా దీవెన, గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లా కోదండపురంలో జ రిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మానవపాడు మండలం జల్లాపురం గ్రామానికి చెందిన బాష, ఎలీషా అనే ఇద్దరు వ్యక్తులు బైక్‌పై హైదరాబాద్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో బుధవా రం తెల్లవారుజామున కొదండపు రం సమీపంలో జాతీయ రహదారి 44పై కర్నూల్ నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న కారు వారి బైక్‌ను ఢీకొట్టింది.
దీంతో తీవ్రంగా గాయప డిన వారిద్దరు అక్కడికక్కడే మర ణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరు కున్నారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తర లించారు. ఈ ఘటనపై కేసు నమో దుచేసి దర్యాప్తు చేస్తున్నారు.