Kamareddypolice : ప్రజా దీవెన, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా లో అర్థ రాత్రి ఓ కారు బీభత్సం సృష్టించిన సంఘటన చోటు చేసు కుంది. అర్థరాత్రి పెట్రోలింగ్ నిర్వహి స్తున్న కానిస్టేబుళ్లపైకి కారు దూ సుకెళ్లిన ఘటనలో ఓ కానిస్టేబుల్ అక్కడిక్కడే మృతి చెందగా, మరో కాని స్టేబుల్‌కు గాయాలయ్యాయి. కారు అతివేగమే ప్రమాదానికి కా రణంగా తెలుస్తోంది.
విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడ కు చేరుకుని గాయ పడిన కానిస్టేబుల్ ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరో కానిస్టేబుల్ మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్ర భుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కానిస్టేబు ళ్లను కారు ఢీకొట్టిన దృశ్యాలు అ క్కడి సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డు అయ్యాయి.
ఈ ప్రమాదం కామారె డ్డి జిల్లాలోని గాంధారిలో ఈ ఘ ట న చోటు చేసుకుంది. గత అర్ధరాత్రి రవికుమార్, సుభాష్ అనే ఇద్దరు కానిస్టే బుళ్లు పెట్రోలింగ్ నిర్వహించారు. ఆ తరువాత వారిద్దరు రోడ్డు పక్క న బైక్‌ను ఆపి నిల్చున్నారు.
ఇంతలోనే ఓ కారు అతివేగంగా దూసుకొచ్చింది. కారు వేగంగా రావ డాన్ని చూసిన సుభాష్ అనే వ్యక్తి అక్కడి నుంచి వెంటనే పక్కకు త ప్పుకున్నాడు. కానీ రవి కుమార్ తప్పించుకునేలోపే కారు అతి వే గం తో అతడిని ఢీకొట్టేసింది. కారు ఢీకొట్టడంతో బైక్‌తో సహా ఆ కాని స్టేబుల్ దూరంగా ఎగిరిపడ్డాడు.
తీవ్రంగా గాయపడిన రవి కుమార్ స్పాట్‌లోని మృత్యువాత పడ్డా డు. అయితే సుభాష్ కను రెప్పపాటులో క్షణాల్లో తప్పించుకోవడం తో స్వల్పగాయాలతో బయ టపడ్డాడు. కారును అంత వేగంగా నడ పాల్సిన అవసరం ఏముంది అనే విషయంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.