Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BRSktr : కాలం తెచ్చిన కరువు కానే కాదు పక్కా కాంగ్రెస్ తెచ్చిన కరువే

కాలం తెచ్చిన కరువు కానే కాదు పక్కా కాంగ్రెస్ తెచ్చిన కరువే

–నీళ్ల మంత్రిజిల్లాలోనే ఉన్నా చు క్కనీరు తేలేకపోవడం సిగ్గుచేటు
–కెసిఆర్ పై గుడ్డి ద్వేషంతో మేడిగ డ్డ సాకుతో గోదావరి నీళ్లను ఆంధ్ర కు వదిలేస్తున్నారు
–ఎస్ ఎల్ బిసి ప్రమాదంలో ఒక మంత్రి చాపల కూర తిoటున్నాడు
–ప్రతీ గడప గడప నుంచి వరంగల్ సభ కు కార్యకర్తలు తరలిరావాలి
–సూర్యాపేట పార్టీ సమావేశంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ ఆర్

BRSktr:   ప్రజా దీవెన, సూర్యాపేట: కాంగ్రెస్ కంచర గాడిదలను కళ్ళారా చూసి న తర్వాతనే ప్రజలకు కేసీఆర్ గొప్పతనం తెలిసి వ చ్చిందని బీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరు చుకుపడ్డారు. కర్కశంగా పాలిస్తున్న కాంగ్రెస్ నుంచి విముక్తి కల్పిం చేందుకు మళ్లీ బిఆర్ఎస్ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుం టున్నారని పేర్కొన్నారు. అధికారం పోయినా ప్రజల్లో మాత్రం టన్ను ల కొద్ది అభిమానం చెక్కు చెదరకుండా అలాగే ఉందని అన్నారు. ప్రతీ తెలంగాణ బిడ్డకు గుండె ధైర్యంగా గులాబీ జెండానే ఉందని, ఈ సంవత్సరం అంతా బీఆర్ఎస్ పోరాట నామ సంవత్సరమే అం టూ కేటీఆర్ అభివర్ణించారు. తదనుగుణంగానే ఏప్రి ల్ 27న తొలి అడుగు పడబోతుందని గుర్తు చేశారు.

గురువారం సూర్యాపేటలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం లో ఆయన ప్రసంగించారు. దశాబ్దాల పాటు తెలుగు వాళ్ళను మద రాసీలు అని పిలిచేదని సదరు పిలుపులను మా ర్చిన నాయకుడ దివంగత ముఖ్య మంత్రి ఎన్టీఆర్ అని గుర్తుచేశారు.ఒక పార్టీ పెట్టి భారత దేశంలో తెలుగు వాళ్ళు కూడా ఉన్నారని చెప్పిన నాయ కుడు నందమూరి తారక రామారావు అన్నారు. ఈ దేశంలో తెలంగా ణకు ఒక ప్రత్యేక అస్తిత్వం ఉందనీ, తెలంగాణ అనే పౌరుషాల గడ్డ ఉందని ఎలుగెత్తి చాటిన నాయకుడు కేసీఆర్ అని, భారతదేశ స్వా తంత్ర చరిత్రలో 25 ఏళ్లు విజయవంతంగా కొనసాగుతున్న అతికొద్ది పార్టీల్లో బిఆర్ఎస్ ఒకటని చెప్పారు.

కెసిఆర్ మోకాలు ఎత్తుకు కూడా సరిపోని వాళ్ళు ఆయన గురించి అవాకులు చెవాకులు మాట్లా డుతున్నారని, వాన పాములు నాగు పాముల లెక్క బుసలు కొడుతు న్నాయని ఎద్దేవా చేశారు. తమ స్థాయి మరచి గ్రామ సింహాలు కూడా కేసీఆర్ మీద మా ట్లాడుతు న్నాయన్నారు. 100 సం వత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఒక వైపు, దేశాన్ని నడుపుతు న్న భారతీయ జనతా పార్టీ ఒక వైపు, ఉ మ్మడి ఆంధ్రప్రదేశ్ కు ము ఖ్యమంత్రిగా ఉంటూ ఢిల్లీలో చక్రం తిప్పు తున్న చంద్రబాబు నాయు డు ఇంకోవైపు ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేసీఆర్ పార్టీ పెట్టి నడపడం ఆషామాషీ విషయం కాదని గుర్తు చేశారు.
తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను కాంగ్రెస్ పార్టీకి తాకట్టు పెట్టిన తెలం గాణ ప్రజా సమితి ని చూసిన ప్ర జ లకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతుం ద న్న నమ్మకం చచ్చిపోయిందన్నారు.కానీ 2001లో ఒక్కడిగా బయలు దేరి శూన్యం నుంచి సునామీ సృ ష్టించి తెలం గాణ సాధించిన మహా నాయకుడు కేసీఆర్ అని, ఇదే చరిత్ర అం టూ వివరించారు. కెసి ఆర్ లేకపోతే గులాబీ జెండా లేక పోతే తెలం గాణ వచ్చేదే కాదని, ప్రజలు, ప్రజా సంఘాలు, విద్యార్థుల పోరా టా లకు కేసీఆర్ నాయకత్వం తోడై విజయం సాధించామని తెలిపారు. 25 ఏళ్ల పార్టీ చరిత్రలో మొదటి 14 ఏళ్ల ఉద్యమ పార్టీగా విశ్వరూ పాన్ని చూపించామన్నారు.


ప్రజాస్వామ్య బద్దంగా తమ డి మాండ్లను నెరవేర్చుకోవచ్చని దేశ ప్రజలకు నిరూపించిన పార్టీ బిఆ ర్ఎస్ అన్నారు. అధికారంలోకి వస్తే పేదల కోసం ఎలా పనిచేయవచ్చో పదేండ్ల పాటుు చూపిస్తూ దేశంలో నే తెలంగాణను నెంబర్ వన్ చేసిన నాయకత్వం కేసీఆర్ ది అని కొని యాడారు. ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర లో ప్రజల పక్షాన ఎలు గెత్తి పోరాడుతున్న ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ అని, ప్రతి తెలంగాణ బిడ్డకు గుండె ధైర్యం ఈ గులాబీ జెండా అని పే ర్కొన్నారు. మాకు ఉద్యమం కొత్త కాదు అధికారం కొత్త కాదు ప్రతిపక్ష పాత్ర కొత్త కాదని గుర్తు చేశారు.
తిరిగి అధికారంలోకి రావాలని కో రుకోవడం మాకోసం కాదు ప్రజల కోసమని, చరిత్రలో ఒక అనివార్య మైన సందర్భంలో బీఆర్ఎస్ పు ట్టిందన్నారు. తెలంగాణ బాగు కో సం మాత్రమే మళ్ళీ అధికారం కో రుకుంటున్నామన్నారు. కర్కశంగా పాలిస్తున్న కాంగ్రెస్ పీడ నుంచి తెలంగాణ ప్రజలను కాపాడేందుకే మళ్లీ బి ఆర్ ఎస్ అధికారంలోకి రావాలని ఆకాక్షించారు.

*ఫీనిక్స్ పక్షిలాగాకదం తొక్కు తోన్న బిఆర్ఎస్ క్యాడర్…*
ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులకు భయపడకుండా పోరా డుతున్న గులాబీ సైన్యానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్న అంటూ వ్యా ఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవం త్ రెడ్డి ది ఒక వికృతమైన మనస్త త్వం అని, చిన్న వయసులో ము ఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డికి పర్సనాలిటీ పెంచుకోవడం మీద కంటే పర్సంటేజీలు పెంచుకో వడం మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందని ధ్వజమెత్తారు. ఢిల్లీకి మూట లు పంపి పదవిని కాపాడుకునే ధ్యాస తప్ప రేవంత్ కు మరో పని లేదని ఆరోపించారు. యూట్యూబ్ ను అడ్డం పెట్టుకొని ముఖ్యమం త్రి అయిన సన్నాసి రేవంత్ రెడ్డి ఇవాళ అదే యూట్యూబ్ జర్నలి స్టులను బట్టలూడదీసి కొడతా అనడం సిగ్గుచేటన్నారు.

నూటికి నూరుశాతం రుణమాఫీ చేశామని నిరూపిస్తే మా పదవుల ను వదిలిపెడతామని చెప్తే ఇప్పటిదాకా ఆ సవాల్ ని కాంగ్రెస్ నాయ కులు ఎవరు స్వీకరిం చలేదని ఎద్దేవా చేశారు. రైతులకు రావాల్సిన 37 వేల కోట్ల రూపాయ లు ఢిల్లీలో రాహుల్ గాంధీ ప్రియాం క గాంధీ ఖర్గే ఖాతాల్లో టింగు టింగు మనీ పడుతున్నాయని ఆరోపిం చారు. కెసిఆర్ కాంగ్రెస్ సన్నాసుల ను నమ్మితే రైతుబంధుకి రామ్ రామ్ అయితదని ముందే చెప్పిండని గుర్తు చేశారు.

నీళ్ల మంత్రి , నల్లగొం డలోని ఉన్నా చుక్కనీరు తేలేక పో తున్నారని, ఎస్ ఎల్ బి సి ప్ర మా దం జరిగితే ఒక మంత్రి పోయి చా పల కూర చేపించుకొని తింటున్నా డని విమర్శించారు. అధికారం మా త్రమే పోయింది ప్రజల్లో అభిమా నం మాత్రం అలాగే ఉందని అన్నా రు. చీకటిని చూస్తేనే వెలుగు విలు వ తెలుస్తుందని, గాడిదని చూస్తేనే గుర్రం విలువ తెలుస్తుందన్నారు. అట్లనే కాంగ్రెస్ కంచర గాడిదలను చూసిన తర్వాతనే ప్రజలకు కేసీ ఆర్ గొప్పతనం తెలిసి వచ్చిందని చెప్పారు. కెసిఆర్ ఉన్నప్పుడు వ చ్చిన నీళ్లు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎం దుకు రావడం లేదని అడిగితే ఏ ఒ క్క కాంగ్రెస్ నేత సమాధా నం చెప్పడం లేదన్నారు.

కెసిఆర్ కట్టిన కాలే శ్వరం నుంచి నీళ్ళు రాకపోతే మరిప్పుడు కాంగ్రె స్ కట్టిన ఎస్సారెస్పీ నుంచి నీళ్లు ఎందుకు రావడం లేదని ప్రశ్నిం చారు. కెసిఆర్ మీద ఉన్న గుడ్డి ద్వేషంతో మేడిగడ్డ చిన్న పర్రె ను రిపేరు చేయించకుండా గోదావ రి నీళ్లను ఆంధ్రకు వదిలేస్తున్నార న్నారు. తెలంగాణ వ్యాప్తంగా పం టలు ఎండుతున్నాయని అంటే కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రె స్ తెచ్చిన కరువే కారణమన్నారు.

*రేవంత్ రెడ్డి పాపo రైతన్నకు శాపం….* కృష్ణానదిలో 36 శాతం నీళ్లను కేసీఆర్ ప్రభుత్వం వాడు కుంది. కానీ ఈ కాంగ్రెస్ సన్నాసుల ప్రభుత్వం 24 శాతం నీళ్లను కూడా వాడుకోలేదన్నారు. నీళ్లు వాడు కు నే తెలివి లేదని, నీటిని పొదుపు చే సుకునే తెలివి లేదన్నారు. చెరువు లనునింపే తెలివి లేదని, భూగర్భ జలాలను పెంచే తెలివి లేదన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను బిజెపి ప్రశ్నిం చదని, బడే భాయ్ మోడీ చోటే బా య్ రేవంత్ మధ్య తెరచాటు ఒప్పందాలు ఉన్నాయ ని ఆరోపించారు. తెలంగాణకు గొంతుగా బిఆర్ ఎస్ ఉండొద్దని కాం గ్రెస్ బిజెపిల ఉమ్మడి లక్ష్యమని చెప్పారు. రేవంత్ రెడ్డి అవినీతిని ఆధారాలతో సహా కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన ఇప్పటివరకు ఎలాంటి చర్య తీసు కోవడం లేదన్నారు.

ఒక్కొక్క గ్రా మం నుంచి బండ్లు కట్టుకుని వరంగల్ సభకు సూర్యా పేట, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ప్రజలు తరలి రావాలని పిలుపు ఇచ్చారు. కాం గ్రెస్ బిజెపి గుండెల్లో రైళ్లు పరిగెత్తించాల్సిన సందర్భం ఏప్రిల్ 27న మరొక్కసారి గులాబీ సైన్యం కదం తొక్కాలని కోరారు. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పిన ఏతుల వెంకటయ్య కథ విని కాం గ్రెస్ ప్రభుత్వానికి బర్దాష్ కాలేదని, అందుకే ఆయనను సస్పెండ్ చేశారని గుర్తు చేశారు. స్పీకర్ పదవికి కుల, మత పట్టింపులు ఉండ వని, స్పీకర్ పదవి అంటే బిఆర్ఎస్ కు ఎంతో గౌరవo ఉందని, ప్ర సాద్ కుమార్ ని ఏక గ్రీవంగా ఎన్నుకోవడంలో మా పాత్ర కూడా ఉందన్నారు.

శాసనసభ మన అందరిదీ అన్న జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేస్తే, గాంధీభవన్ లెక్క సభను నడుపుతున్నారని అన్న అక్బరుద్దీన్ ఓ వైసీ మీద చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. పంచ పాండవుల మాదిరి ఆ కౌరవసభ లో 100 మందిని ఎదుర్కొంటు న్న ది కేసీఆర్ గులాబీ దండు మాత్ర మేనని తెలిపారు. గులాబీ జెండా కప్పుకున్న ప్రతి బిడ్డ వరంగల్ రా వాలని పిలుపునిచ్చారు. వరంగ ల్ సభ త ర్వాత మే నెలలో పార్టీ సభ్య త్వ నమోదు ప్రారంభమవు తుంద ని, కొత్త కమిటీలను పటిష్టంగా ని ర్మించుకుందామని, గ్రామస్థాయి వా ర్డు స్థాయి, బూత్ స్థాయి, రాష్ట్ర కమిటీ దాకా అద్భుతంగా కమిటీ లను ఏర్పాటు చేసుకుందామని హమీ ఇచ్చారు.

కష్టకాలంలో పార్టీ నే నమ్ముకొని ఉన్న వారికే పెద్దపీట వేస్తాం. వారికే అవకాశాలు ఇస్తా మని, చిన్న పెద్ద అనే తేడా పార్టీలో లేదన్నారు. పార్టీ ఆఫీసులను చైత న్య కేంద్రంగా మార్చుకొని కార్యకర్తలకు అ ద్భుతంగా శిక్షణ ఇస్తా మన్నారు. చివరి సంవత్సరంలో ఏదో ఒక పథకం ఇచ్చినట్టు చేస్తే ప్రజలు తమనే మళ్లీ గెలిపిస్తారన్న నమ్మకం తో కాంగ్రెస్ నేతలు ఉ న్నా రని, ఈ విషయాలను ప్రజలకు అర్థమ య్యేలా గులాబీ కార్యకర్తలే సమాధానం చెప్పాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలో కి రావాలంటే కెసిఆర్ లాగా ప్రతీ కార్యకర్త కథానాయకుడు లాగా విజృంభించాలని స్పష్టం చేశారు.ఏప్రిల్ 27 నాడు దానికి తొలి అడు గు పడాలని, ఈ సంవత్సరం అంతా బీఆ ర్ఎస్ పోరాటనామ సంవ త్సరంగా ఆయన అభి వర్ణించారు.

*ఢిల్లీ పెద్దలకు కప్పం కట్టేందుకు తెలంగాణ సంపద…* తెలం గాణ సంపదను సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దలకు కప్పం కట్టార‌ని బీ ఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ ఆ ర్ తీవ్ర ఆరోపణలు చేశారు. అధికా రంలోకి వచ్చిన 15 మాసాల కాలం లో రేవంత్ రెడ్డి 40 సార్లు ఢిల్లీకి వె ళ్ళాడని వెళ్లినప్పుడల్లా డబ్బులను అక్కడి పెద్దలకు కడుతూ వస్తు న్నార‌ని ఆరోపించారు. ఇప్ప‌టికే రూ.30 వేల కోట్లు కప్పం క‌ట్టార‌ని అంటూ ఆ క‌ప్పం కట్టకపోతే హైద రాబాదుకు వచ్చేసరికి ఆయన పద వి పోతుందని ఎద్దేవా చేశారు. శూన్యం నుండి సునామి సృష్టిం చిన మహా నాయకుడు కేసిఆర్ అని కొని యాడారు.

కెసిఆర్ పార్టీ స్థాపించినప్పుడు ఆయనకు కండబలం, అంగ బలం, ఆర్థిక బలం, కుల బలం లాంటివి ఏమీ లేవని ప్రజల్లో ఉన్న తెలం గాణ కాంక్షనే గొప్ప ఉద్యమానికి ఊపిరి పోసిందని అన్నారు. ఉమ్మ డి నల్లగొండ జిల్లాలో 11 ఎమ్మెల్యే స్థానాలు, రెండు ఎంపీ స్థానాలలో బీ ఆర్ఎస్ ఓడిపోతే నల్లగొండ జి ల్లాలో పార్టీ పని అయిపోయిందని కొంతమంది నాయకులు అవాకు లు, చవాకులు పేలాలని వారికి ఈ సమావేశానికి వచ్చిన కార్యకర్తల బలమే బుద్ధి చెబుతుందని అ న్నా రు. బీఆర్ఎస్ పార్టీ మూడు పాత్రల్లో అద్భుతమైన విజయం సాధిం చిందన్నారు. 14 సంవత్సరా లు ఉద్యమ పార్టీగా, పది సంవ త్సరా లు అధికారంలో ఉంటూ తె లంగాణ అభివృద్ధిలో, 15 మాసాల నుండి ప్రతిపక్ష పార్టీగా అనునిత్యం ప్రజల పక్షాన నిలవడం ఆనందంగా ఉందన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుతో రెండున్నర లక్షల ఎకరాలకు సాగు నీరు అం దించి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బంగారం లాంటి పంట లను పం డించామని చెప్పారు. అసమర్థ పాలనతో సూర్యాపేట జిల్లాలో గోదా వరి జ‌లాలు అందక వేలాది ఎకరాల భూమి నిలువునా ఎండిపో తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, ఇద్దరు ఎంపీలను సమర్థవంతంగా ఎదుర్కొంటూ వారికి ధీటుగా జ‌వా బు చెబుతున్నారంటూ కితాబు నిచ్చారు. బొల్లం మల్లయ్య యాద వ్ కారు కొంటే ప్రజల సొమ్ముతో జ ల్సా పడుతున్నాడని ఈర్ష‌ పడ్డా రని, మరో ఎమ్మెల్యే కొత్త షర్టు వే సుకున్నా ప్రజల సొమ్మేనని ప్రచా రం చేశారని ఆయన అన్నారు. కెసిఆర్ పెద్ద దొర అని, ఆయనది దొరల పాలన అని, తెలంగాణ వస్తే ఆయన కుటుంబం కోసమే తెలం గాణను తెచ్చుకున్నార‌ని ఇలా ప్రతి ఒక్కరి మదిలో కేసీఆర్ పై ద్వేషం పెంచార‌ని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి మా ట్లాడుతూప్రశ్నించే గొంతుకను కాంగ్రెస్ ప్రభుత్వం నొక్కే ప్రయత్నం చే స్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ వ్యతిరేక చర్యలపై తిరగబడాల్సిన సమయం ఆస న్నమైందని పిలుపునిచ్చారు. ఉమ్మ డి నల్లగొండ జిల్లాలో పార్టీ ఏమాత్రం బలహీన పడలేదని చెప్పారు. ప్రతిపక్ష పార్టీ నాయకు లపై ఎన్ని కేసులు పెట్టినా ప్రభుత్వ పథకాల అమలు కోసం నిలదీస్తూ నే ఉంటామని జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. వరంగల్ లో జరిగే పార్టీ 25 సంవత్సరాల వేడుక కార్యక్ర మానికి జిల్లా నుండి అధిక సంఖ్య లో కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యుడు బడు గుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్, కంచర్ల భూపాల్ రెడ్డి, నల్లమోతు భాస్కరరావు, రామావత్ రవీంద్ర కుమార్, బొల్లం మల్లయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.