Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister Komati Reddy Venkat Reddy : మహిళా చదువుతోనే దేశాభివృద్ధి

— విద్య ప్రతి ఒక్కరికి ముఖ్యమే

–సమయాన్ని వృధా చేసుకోకుండా కష్టపడి చదివి పైకి రావాలి

–రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

–మహిళా డిగ్రీ కళాశాలలో అదనపు తరగతి గదులను ప్రారంభించిన మంత్రి

–నల్గొండ ఏటిసిని త్వరలో ప్రారంభిస్తామని వెల్లడి

Minister Komati Reddy Venkat Reddy : ప్రజా దీవేన నల్గొండ : మహిళ చదువుకుంటే కుటుంబంతోపాటు, సమాజం, తద్వారా దేశమే అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని రామగిరి లో ఉన్న మహిళా డిగ్రీ కళాశాలలో కోటి రూపాయల ఎస్ డిఎఫ్ నిధులతో నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ చదువు ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమని, కుటుంబాలు బాగుపడాలంటే ప్రతి ఒక్కరు చదువుకోవాలి అన్నారు. ఇంటర్మీడియట్ విద్య జీవితాన్ని మార్చే సమయమని, అందువలన సమయాన్ని వృధా చేసుకోకుండా కష్టపడి చదివి పైకి రావాలని, సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న మహిళలను ఆదర్శంగా తీసుకొని విద్యార్థినిలు చదవాలన్నారు. రామగిరి మహిళా డిగ్రీ కళాశాలను దశలవారీగా అంచలంచలుగా అభివృద్ధి చేస్తున్నామని, అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు.

నిర్మాణంలో ఉన్న మరో నూతన బ్లాక్ ను త్వరలోనే ప్రారంభిస్తామని, అంతేకాక బయోటెక్నాలజీ ల్యాబ్ ను పూర్తి చేయిస్తామని తెలిపారు. విద్యార్థినిలు సెల్ ఫోన్ ను తక్కువగా వాడాలని, సెల్ఫోన్ తో అనేక ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు. ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా జూనియర్ కళాశాలను బాగా అభివృద్ధి చేయడం జరిగిందని, 400 నుండి 3000 వరకు విద్యార్థుల సంఖ్యను పెంచడం జరిగిందని, అలాగే మహిళా డిగ్రీ కళాశాలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, ఈ సంవత్సరం స్టేట్ ర్యాంకు సాధించేందుకు కృషి చేయాలని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 65 ఏటీసీలను మంజూరు చేసిందని, నల్గొండ ఏ టి సి ని త్వరలోనే ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు.
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో సాధికారత సాధించేందుకు విద్య చాలా ముఖ్యమన్నారు. అందువల్ల విద్యార్థినీ లు బాగా చదువుకోవాలని, తల్లిదండ్రులు ఎన్నో కష్టాలకు ఓర్చి పిల్లలను చదివిస్తారని, అందువల్ల కష్టపడి చదవాలన్నారు. ప్రభుత్వం కల్పించే ఉపకార వేతనాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.


ప్రిన్సిపల్ శ్రీనివాసరాజు మాట్లాడగా,అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, ఆర్డిఓ వై. అశోక్ రెడ్డి, ప్రతీక్ ఫౌండేషన్ చైర్మన్ గోనారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్,ఇతర అధికారులు, తదితరులు ఉన్నారు.

పెట్రోల్ పంపుకు స్థల పరిశీలన…

అనంతరం మంత్రి ఎస్ఎల్బిసి కాలని ప్రభుత్వ మెడికల్ కళాశాల పక్కన మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించే పెట్రోల్ పంపు, రెస్టారెంట్ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. కాగా 381 సర్వే నంబర్ లో పెట్రోల్ పంపు, రెస్టారెంట్ మహిళా సమాఖ్యల ద్వారా నిర్వహించేందుకుగాను రెండు ఎకరాల స్థలాన్ని సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అనంతరం ఎస్ఎల్బిసి బత్తాయి మార్కెట్లో నిర్మాణంలో ఉన్న తాగునీటి వాటర్ ట్యాంక్ ను తనిఖీ చేశారు. వాటర్ ట్యాంకు పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. డిఆర్డిఓ శేఖర్ రెడ్డి తో పాటు, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ తదితరులు ఉన్నారు.