–బహిరంగంగా మద్యం, సిగరెట్ తాగితే చట్టపరమైన చర్యలు
— సూర్యాపేట ఎస్పీ కె నరసింహ
Suryapet SP K Narasimha : ప్రజా దీవెన సూర్యాపేట: సూర్యాపే ట జిల్లాలో బహిరంగంగా మద్యం తాగడం, ధూమపానం సిగ రెట్ చేయడం, ప్రభుత్వ నిషేధిత గు ట్కా అమ్మడం,లాంటివి చట్ట రీత్య నేరమని జిల్లా ఎస్పీ నరసింహ ఒక ప్రకటనలో తెలిపారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలపై జిల్లా వ్యాప్తంగా నిఘా ఉంచాం అని, అక్రమ సిట్టింగ్ లు, బహిరంగంగా మద్యం తాగడం, సిగరెట్ తాగడం లాంటి అసాంఘిక చర్యలకు పాల్ప డే వారిపై చట్టపరంగా కఠిన చర్య లు తీసుకోవటం జరుగుతుందని హెచ్చరించారు. ప్రభుత్వ నిషేధిత గుట్కా అమ్మకాలు చేయవద్దు. ఇలాంటి వాటికి పిల్లలు అలవాటు పడి తప్పుడు మార్గం లోకి వెళ్ళే అవకాశం ఉన్నది అని గుర్తు చేశా రు.
కావున ప్రతి ఒక్కరికీ సామాజి క బాధ్యత ఉండాలని ఇలాంటివి బహిరంగంగా చేయడం మానుకో వాలని అన్నారు. బహిరంగంగా మ ద్యం తాగడం ఎదుటివారికి ఇబ్బం ది కరంగా ఉంటుంది ఇలాంటివి చేయడం బాధ్యతగల పౌరుల లక్ష ణం కాదన్నారు. పట్టణ న్యూసెన్స్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు. మైనర్ పిల్లలకు మ ద్యం, పొగాకు ఉత్పత్తుల లాంటి మత్తు పదార్థాలను అమ్మవద్దని హెచ్చరించారు. వీటి వల్ల పిల్లలు చెడు వ్యసనాలకు అలవాటు పడి నేరాలకు పాల్పడే అవకాశం ఉన్న దని, పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుందని గుర్తు చేశారు.