Bhagat Singh : ప్రజా దీవేన, కోదాడ: బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించిన భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవ్ ఆత్మత్యాగాలుఅజరామరమని ప్రజా చైతన్య వేదిక బాధ్యులు రాయపూడి వెంకటేశ్వరరావు పందిరి నాగిరెడ్డి పేర్కొన్నారు.. ఆదివారం ఎమ్మెస్ కళాశాలలో భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన అనంతరం మాట్లాడారు.. విప్లవం వర్ధిల్లాలి సామ్రాజ్యవాదం నశించాలని ఇంగ్లాండ్ పార్లమెంటులో భగత్ సింగ్ తో పాటు రాజగురువు సుఖదేవులు నినాదాలు చేశారని పేర్కొన్నారు…
నేడు మతోన్మాద శక్తులు సమాజాన్ని విచ్ఛిన్నం చేసేందుకు పన్నుతున్న కుట్రలను తిప్పి కొట్టాలన్నారు. స్వాతంత్రోద్యమంలో ఏమాత్రం పాత్రలేని మతోన్మాద శక్తులు రెచ్చగొట్టి నేడు మత ప్రమీయదేశంగా మార్చేందుకు కుయుక్తుల పన్నుతున్నారన్నారు.. దేశంలోని విద్యార్థి యువజన మేధావులు ఈ దుశ్చర్యలకు వ్యతిరేకంగా ఉద్యమించాలన్నారు.. ఈ సమావేశంలో హరి కిషన్ రావు బడుగుల సైదులు మస్తాన్ రాపర్తి రామ నరసయ్య రాఘవరెడ్డి రాధాకృష్ణ ఉదయగిరి వేణు అప్పిరెడ్డి బాబు జాఫర్ లక్ష్మీనారాయణ హనుమంతరావు కాజా రవి పాల్గొన్నారు