Big Breaking : ప్రజా దీవెన సూర్యాపేట:సూర్యాపేట జిల్లాలో అధికార పార్టీ నాయకుని హత్య కేసులో పోలీస్ అధికారి పై వేటు పడింది. సూర్యా పేట నూతనకల్ మండలం మిర్యా ల గ్రామంలో మెంచు చక్రయ్య గౌడ్ హత్య కేసులో నిర్లక్ష్యంగా వ్యవ హరించారన్న అభియోగం తో సూర్యాపేట డీఎస్పీ రవి, సీఐలపై బదిలీ వేటు పడగా ఎస్ఐకి మెమో జారీ చేశారు ఉన్నతాధికారులు.
డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మెంచు చక్రయ్య గౌడ్ కుటుంబం సభ్యుల మధ్య గొడవలు ఉన్నాయని కు టుంబ సభ్యులు హత్యకు ముం దుగా పోలీసులకు సమాచారం ఇచ్చినా కూడా ఈ కేసు విష యం లో నిర్లక్ష్యం వహించిన కార ణంగా సూర్యాపేట డీఎస్పీ రవి, తుంగ తుర్తి సీఐపై బదిలీ వేటు వేయగా ఎస్ఐకి మెమో జారీ చేశారు.