— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
Nalgonda District Collector Tripathi : ప్రజా దీవెన, గుడిపల్లి: మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏదైనా సా ధిస్తారని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.శుక్రవారం నల్గొండ జిల్లా, గుడిపల్లి మండల కేంద్రంలోని ప్రాథ మిక వైద్య ఆరోగ్య కేంద్రంలో కిశోర బాలికలు, గర్భిణీ స్త్రీలు, బాలింత లకు ఉద్దేశించి పౌష్టికాహారం,వైద్య చికిత్సలు, తీసుకోవాల్సిన జాగ్రత్త లపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, మ హిళా శిశు సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అవ గాహన సదస్సు కు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
భావితరాల భవిష్యత్తు గర్భిణీ స్త్రీల చేతుల్లోనే ఉందని, వారు తీసుకోబోయే ఆహారం, జాగ్రత్తల పైనే పుట్టబోయే పిల్లలు ఆధారపడి ఉంటారని అన్నారు. అందువలన ప్రతి మహిళ తప్పనిసరిగా పౌష్టికా హారాన్ని తీసుకోవడంతో పాటు, క్ర మం తప్పకుండా వైద్య పరీక్షలను చే యించుకోవడం, తల్లి, బిడ్డల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని కోరారు .
దేవరకొండ ప్రాంతంలో మహి ళల్లో రక్తహీనత, మాత, శిశు మర ణాలు, మూఢనమ్మకాలు, బాల్య వివాహాలు, మేనరిక వివాహల వం టి సమస్యలు ఎక్కువగా ఉన్నా యని ,అందుకే ఈ ప్రాంతంలో మ హిళలు వివిధ రకాల జబ్బులతో బాధపడడం తాము గుర్తించినట్లు తెలిపారు .వీటన్నిటిని అరికట్టేందు కు మహిళల్లో పౌష్టికాహారం పట్ల అవగాహన కల్పించడమే కా కుం డా, సరైన సమయంలో వైద్య చికి త్సలు పొందడం, పుట్టబోయే బిడ్డ, పుట్టిన పిల్లల సంరక్షణ వంటి అం శాలపై అవగాహన కల్పించేందుకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసి నట్లు తెలిపారు.
దేవరకొండ ప్రాంతంలో సంభవించే ప్రతి శిశు మరణం కేసును కూలం కషంగా సమీక్షిస్తున్నామని తెలిపా రు. సరైన ఆహారం తీసుకోకుంటే పుట్టబోయే పిల్లలు అనారోగ్యంతో పుడతారని, అవయవాలు సరిగా లేకుండా పుడతారని, ముఖ్యంగా మేనరికం వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తుతాయని అన్నారు . గర్భిణీ స్త్రీలు తీసుకునే భోజనం పైనే భా వితరాలుఆధారపడి ఉంటాయ న్నారు. స్థానికంగా లభించే తృణ ధాన్యాలు ,పప్పులు వంటి ఆహారా న్ని తీసుకోవాలని, ఆకుకూరలు, కూరగాయలతో పాటు, మాంసకృ తులు తీసుకోవాలని చెప్పారు.
పిల్లలు పుట్టిన తర్వాత రెండు సం వత్సరాల వరకు జాగ్రత్తగా చూసు కోవాలని, ఆయా సమయాలలో టీ కాలు వేయించడం, రోగ నిరోధక శక్తిని పెంచేందుకు అవసరమైన మందులు తీసుకోవాలన్నారు. అం గన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికా హారంతో పాటు ,ఓఆర్ఎస్ పాకె ట్లు, కొబ్బెర నీళ్లు , పళ్ళ రసాల వంటివి గర్భిణీ స్త్రీలు తీసుకోవాల ని అప్పుడే పుట్టబోయే బిడ్డ ఆరో గ్యం అంతగా పుడతారని చెప్పా రు.
భవిష్యత్తులో మహిళలు మంచి స్థానంలో ఉండాలంటే ఇప్పటినుం డే పౌష్టికాహారంతో పాటు, బాగా చదువుకోవడం, ముందస్తు ప్రణా ళిక వేసుకోవడం చేయాలన్నారు. మగ, ఆడ వివక్షతను విడనాడా లని, ఎట్టి పరిస్థితులలో లింగ నిర్ధారణ పరీక్షలు చేయరాదని, ఒకవేళ ఎవరైనా లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు, చేయించుకు న్నట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసు కుంటామని హెచ్చరించారు. ప్రస్తు త సమాజంలో కుమారుల కంటే కూతుర్లే తల్లిదండ్రులను బాగా చూసుకుంటున్నారని, అందువల్ల వివక్షను చూపించవద్దని పునరు ద్గాటించారు.
దేవరకొండ ఏ ఎస్ పి మౌనిక మాట్లాడుతూ మహిళలు ఆర్థిక సాధికారత సాధించేందుకు ప్రయ త్నించాలని ,అప్పుడే కుటుంబంలో విలువ పెరుగుతుందని,ఇందుకు ఖాళీగా ఉండకుండా చిన్న పనైనా చేసుకోవాలని, మహిళలపై గృహ హింస ఇతర దౌర్జన్యాలకు పాల్ప డినట్లయితే తమను ఆశ్రయిం చాలని, ప్రభుత్వం మహిళలకు అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నదని, వాటిని సద్వినియో గం చేసుకొని జీవితంలో స్థిరప డాలని, గర్భిణీ స్త్రీలు ఆరోగ్యంగా ఉండేందుకు బలవర్ధకమైన ఆహా రం తీసుకోవాలని, మగపిల్లాడైన, ఆడపిల్ల అయినా ఒకటే అని, అం దువల్ల ఆడ, మగ తేడా లేకుండా చూడాలని కోరారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు బాలింతలు తీసు కోవాల్సిన జాగ్రత్తలపై సలహాలు, సూ చనలు ఇచ్చారు. అంతేకాక ప్రసవమైన వెంటనే తప్పనిసరిగా తల్లిపాలు పట్టాలని ప్రసవానికి ముందు ప్రశాంత వాతావరణంలో ఉండాలని ఎట్టి పరిస్థితులలో మేనరికం వివాహాలు చేసుకోవద్దని అన్నారు.
జిల్లా సంక్షేమ అధికారిని కృష్ణవేణి మాట్లాడుతూ మహిళలు రక్తహీన త నుండి బయటపడేందుకు ఐరన్ మాత్రలు తీసుకోవాలని, సకాలం లో టీకాలు వేసుకోవాలని, గర్భిణీ స్త్రీలు పిల్లలకు ముర్రుపాలు పట్టా లని దీనివల్ల బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారన్నారు.
గైనకాలజిస్ట్ డాక్టర్ విజయ మాట్లా డుతూ సరైన సమయంలో సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల రక్తహీనత వస్తుందని ,ఆరోగ్యమైన బిడ్డ పుట్టడం తల్లి తీసుకునే ఆహా రం పైన ఆధారపడి ఉంటుందని, కిషోర బాలికలు, మహిళలు జంక్ ఫుడ్ తీసుకోవద్దని ,ఆహారపు అలవాట్లు, క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేసినట్లయితే కిషోర బాలికలు వయసుకు ముందే రజ స్వల కాకుండా ఆపవచ్చ ని, అలాగే బహిష్టులో ఏవైనా సమ స్యలు ఉన్నట్లయితే తక్షణమే డాక్టర్ను సంప్రదించాలని అన్నారు. మహిళలు బాల్య వివాహాలు చేసు కోవద్దని, దీనివల్ల అనేక సమ స్యలు వస్తాయని ,అవయవాలు సరిగా లేకపోవడం వంటి వాటితో బిడ్డలు పుడతారని, ఎంసీపీ కార్డు లను తప్పనిసరిగా వాడాలని, బిడ్డకు బిడ్డకు మధ్య కనీసం రెండు సంవత్సరాల ఎడమ ఉండేలా జాగ్ర త్తలు తీసుకోవాలని సూచించారు.
స్థానిక పి హెచ్ సి డాక్టర్ రాజేష్, ఎంపీడీవో పద్మ మాట్లాడారు. ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు తీసుకోవ డం ద్వారా రక్తహీనత నుండి బయటపడిన అనిత అనే కిషోర బాలిక తనకు రక్తం ఏ విధం గా పెరిగిందో తెలియజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఏఎస్పీలు పౌష్టికాహార కిట్లను పం పిణీ చేశారు అనంతరం జిల్లా కలె క్టర్ ఎంపిడిఓ కార్యాలయాన్ని, త హసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు.కాగా తహసిల్దార్ కార్యా లయంలో ఫర్నిచర్ కొరత ఉందని తెలుసుకొని ఫర్నిచర్ సమస్యను తీరుస్తామని చెప్పారు. గుడిపల్లి తహసిల్దార్ మధు హా సిని, పిహెచ్ సి సిబ్బంది, ఐసిడి ఎస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.