–ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్
SFI Khammampati Shankar : ప్రజాదీవెన నల్గొండ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల పై సుప్రీంకోర్టు స్టే విధించడాన్ని స్వాగతిస్తున్నామని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శిలు ఆకారపు నరేష్, ఖమ్మంపాటి శంకర్ గురువారం వారు మీడియాతో మాట్లాడారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరగుతున్న విధ్వంసాన్ని, చెట్లను నరకడాన్ని ఆపాలని చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని చాల సీరియస్ గా హెచ్చరించి స్టే విధించిందని పేర్కొన్నారు. దీనిని ఎస్ఎఫ్ఐ నల్లగొండ జిల్లా కమిటీ హర్షిస్తుందని పేర్కొన్నారు.
ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ 400 ఎకరాలను కార్పోరేట్ శక్తులకు అమ్మే ప్రయత్నాన్ని విరమించుకోవాలన్నారు. సుప్రీంకోర్టు స్టే తోనైనా ప్రభుత్వం యూనివర్శీటీ కి 400 ఏకరాల భూమిని కేటాయించాలని కోరుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధ, నియంతృత్వ చర్యలను ఆపాలి.
విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి. 400 ఎకరాల భూమిని యూనివర్సిటీ కి కేటాయించాలనీ కోరారు. విద్యార్థుల పోరాటాల ద్వారా నే స్టే విధించారని పోరాడిన విద్యార్ధి లోకానికి, ప్రజా సంఘాల కు ప్రజాతంత్ర ఉద్యమానికి జేజేలు తెలుపుతున్నామని పేర్కొన్నారు.