Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Radical changes with reforms: సంస్కరణలతో సమూల మార్పులు

--ప్రతిష్టాత్మక రైతుబంధు విధివిధానాల్లో సంస్కరణలు --వచ్చే వానాకాలం నుంచి రైతుబంధులో పలు మార్పులు --బంధు పరిమితి నిర్దేశించేందుకు ప్రభుత్వo తర్జనభర్జనలు --ఆదాయపన్నుదారులకు అపివేసే యోచనలో అధికారులు --నిలిపివేసే జాబితాలో అధికారులు, ఉద్యోగులు, సంపన్నులు --పరిమితి ఐదు ఎకరాలు లేదంటే పది ఎకరాలపై సమాలోచనలు

సంస్కరణలతో సమూల మార్పులు

–ప్రతిష్టాత్మక రైతుబంధు విధివిధానాల్లో సంస్కరణలు
–వచ్చే వానాకాలం నుంచి రైతుబంధులో పలు మార్పులు
–బంధు పరిమితి నిర్దేశించేందుకు ప్రభుత్వo తర్జనభర్జనలు
–ఆదాయపన్నుదారులకు అపివేసే యోచనలో అధికారులు
–నిలిపివేసే జాబితాలో అధికారులు, ఉద్యోగులు, సంపన్నులు
–పరిమితి ఐదు ఎకరాలు లేదంటే పది ఎకరాలపై సమాలోచనలు

ప్రజా దీవెన/ హైదరాబాద్‌: తెలంగాణలో వారు వీరు అని తేడా లే కుండా అన్ని వర్గాలకు అన్ని స్థాయిల్లో అమలవుతున్న ఏకైక ప్రతి ష్టాత్మక పథకం రైతుబంధు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతి ష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకం ప్రారంభంలో ఆశించిన స్థాయిలో మైలేజీ ఇచ్చినా ఆ తర్వాత అనేక రకాల అపోహలకు దారి తీసింది. తెలంగాణ నలుగు దిక్కుల్లోని ప్రజల్లో రకరకాల చర్చలకు దారి తీసి న రైతుబంధు పథకo పై గత ప్రభుత్వమే అన్ని మార్గాల్లో తర్జన భర్జన పడినప్పటికీ అంతటి తోటే ఆగిపోయింది.

అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం గత ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు పథకంలో మార్పులు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించుకుంది. రై తుబంధు లో మార్పులు చేర్పుల విషయంలో ఇప్పటికే చర్చోపచర్చ లు జరుగు తున్న తరుణంలో కసరత్తు ప్రారంభమైంది. రైతుబంధు అమలులో సంస్కరణలు తీసుకొని రావడం ద్వారా సమూల మార్పు లు చేయా లని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు సమాలోచనలు చేస్తున్నారు.

తెలంగాణ లో గుంట భూమి నుంచి గుట్టలు, పుట్టలు కల్గిన రైతుల నుంచి వందల ఎకరాలున్న భూస్వాములు, ప్రముఖు లు, సినీ, రాజ కీయ, బడా, చోటా వ్యాపార రంగాల వారి ఖాతాల్లో రైతుబంధు కచ్చి తంగా జమఅవుతోందంటే అతిశయోక్తి కాదు. వ్యవసాయ పనుల ప్రారంభంలో రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేం దుకు ఆర్ధిక సహాయం చేయడం ద్వారా సాయపడటమే లక్ష్యంగా ఏర్పడిన ఈ పథకం కింద భారీ స్ధాయిలో భూములున్న వారికి, వ్యాపార, వా ణిజ్య వర్గాలకు చెందిన ధనికులకు రైతుబంధు ఎందుకు ఇవ్వాల న్న విమర్శలు గత కొంత కాలంగా సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

పథకాన్ని తీసుకొచ్చిన గత టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనూ ఇలాంటి వి మర్శలు వెల్లువెత్తినప్పటికీ నాటి ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌ అంద రికీ వర్తింపజేయాలని భావించి ముందుకు సాగారు.

పరిమితి ఎంతవరకైతే పదిలమని కసరత్తు… రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌ సర్కారు రైతులకు ఎక రానికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని, కౌలు రైతులు, కూలీల కు కూడా ఆర్థికసాయం చేస్తామని ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన విష యం తెలిసిందే.

ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు సాయా న్ని ఐదెకరాలకే పరిమితo చేస్తే ఇచ్చిన హామీలు ఎలాంటి అవరోధా లు లేకుండా అమలు చేయవచ్చన్న లోతైన ఆలోచనతో ఐదు ఎకరా ల పరిమితి నిబంధన వర్తింపజేసే అవకాశాలు మెండుగా ఉన్నాయ ని అధికార పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

అదే సందర్భంలో పదెక రాలలోపు పరిమితి ఆలోచన కూడా లేకపో లేదని వ్యవసాయ శాఖ అధికారులు అనధికారికంగా వెల్లడిస్తున్నా రు. ఏది ఏమైనప్పటికిభారీగా ఆస్తులున్న రాజకీయ ప్రముఖులు, ప్ర జాప్రతినిధులు, అధికారులు, సెలబ్రిటీలు, ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారికి రెండు మూడెకరాలున్నా రైతుబంధు ఇవ్వకూడదని భావిస్తు న్నట్టు సమాచారం.

మొత్తానికి రైతు బంధు పరిమితి పై విస్త్రుతస్ధా యిలో చర్చలు కొనసాగుతున్న నేపద్యంలో ఇప్పటికిప్పుడే సంస్కర ణల సారాంశం చెప్పలేమని అటు అధికార పార్టీ నాయకులతో పాటు అధికారులు సైతం స్పష్టం చేస్తున్నారు. రైతు బంధు లో మా ర్పులు చేర్పులు ఇప్పటికిప్పుడు అమలయ్యే అవకాశం లేనందున యాసంగి సీజన్‌లో గతంలో మాదిరిగానే రైతుబంధు పథకాన్ని అమలు చేసి, వచ్చే వానాకాలం సీజన్‌ నుంచి కొత్త సంస్కరణలు అమల్లోకి తీసుకొస్తారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

ఇదిలా ఉండగా తెలంగాణ లో మొత్తంగా 68.99 లక్షల మందికి రైతు బంధు పథకం అమలవుతోంది. ఆయితే రైతుబంధు పథకం 2018 వానాకాలం సీజన్‌ నుంచి ప్రారంభం కాగా అప్పట్లో ప్రతి సీజన్‌లో ఎకరాకు రూ.4 వేల చొప్పున, ఏటా రూ.8 వేల చొప్పున రైతులకు బంధు అందజేశారు. ఆ తదనంతరం కెసిఆర్ ప్రభుత్వం దాన్ని కాస్తా ఏడాదికి రూ.10 వేలకు పెంచిoది.

ఈ క్రమంలో రాష్ట్రంలో అత్యధికంగా సన్నచిన్నకారు రైతులే ఎక్కువగా ఉన్నారని, ఐదెకరాల పరిమితి విధిస్తే అవసరమైన రైతులకు పథకాన్ని వర్తింపచేసినట్టు అవుతుందని వ్యవసాయ అధికారులు భావిస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.