Sukanya Yojana Scheme : గ్రామములో ఆడపిల్ల పుడితే సుకన్య యోజన పథకం కింద తల్లి పేరు మీద ఫిక్సి డిపాజిట్
Sukanya Yojana Scheme : ప్రజా దీవెన, కోదాడ: అనంతగిరి మండల పరిధిలోని గోండ్రియాల గ్రామంలో నూతన సంవత్సరం కానుకగా (2025) గ్రామంలో ఆడపిల్ల పుడితే కొంత నగదును ఆడపిల్ల తల్లి పేరుమీద పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ ఓపెన్ చేసి సుకన్య యోజన పథకం కింద పిక్స్ డిపాజిట్ చేస్తున్నామని అనంతగిరి మండల తహశీల్దార్ హిమబిందు అన్నారు గ్రామంలో బుధవారం రెండో బేబీ కి గౌరారపు లౌక్ష్య జన్మనిచ్చింది ఈ సందర్భంగా అనంతగిరి ఎమ్మార్వో హిమబిందు పోస్ట్ ఆఫీస్ పాస్ బుక్ ను అందజేశారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ గొండ్రియాలు గ్రామంలో ఆడపిల్లగా పుట్టటం అదృష్టంగా భావించవచ్చు అలాగే ఆడపిల్లకు మంచి భవిష్యత్తును అందజేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు.
ఆ పాపను ఎవరో ఒకరు ఆశీర్వదించటం కంటే ఈ గ్రామం మొత్తం ఆశీర్వదించడం చాలా గొప్ప పరిణామాన్ని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మన ఊరు మహాలక్ష్మి వాలంటీర్లు మరియు గ్రామ పెద్దలు గ్రామ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు