Collecterilatripathi : దర్తి ఆబాజన జాతీయ ఉత్కర్ష అభియాన్ పథకం ప్రణాళికలు
నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
Collecterilatripathi: ప్రజా దీవెన, నందికొండ: దర్తి ఆబాజ న జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ పథకం కింద గిరిజన తండా లు, వెనుకబడిన గిరిజన గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు గాను కార్యాచరణ ప్రణా ళికతో పాటు, అంచనాలు రూపొం దించా లని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపా ఠి అధికారులను ఆదేశించారు.దర్తి ఆబా యోజన పథకం కింద కల్పిం చే మౌలిక వసతుల విషయమై గురువారం ఆమె నల్గొండ జిల్లా పెద్దవూర మండలం, నందికొండ మున్సిపల్ కార్యాలయంలో సంబం ధిత అధికారులతో సమన్వయ స మావేశం నిర్వహించారు.
దర్తి ఆభా యోజన కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గత సంవత్సరం నవంబర్ 14 న ప్రారంభించడం జరిగిందని, ఈ పథకం అమలులో భాగంగా అత్యంత వెనుకబడిన గిరిజన గ్రామాలు ,తండాలలో గిరిజనులకు మౌలిక వసతుల కల్పనతో పాటు, వారి చలనాన్ని పెంచడం,జీవన ప్రమాణాలు పెం చేందుకు చర్యలు తీసుకోవడం జ రుగుతుందని, మైదాన ప్రాంతంలో మాదిరిగానే వారికి సౌకర్యాలను కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం అని అన్నారు.
ఇందులో భాగంగా నల్గొండ జిల్లా లోని అన్ని చెంచు పెంటలు, గూ డెంలలో సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ప్రత్యేకించి నాగార్జు నసా గర్ నియోజకవర్గ పరిధిలో తిరుమ లగిరి సాగర్, పెద్దవూర, త్రిపురారం మండలాలలో గుర్తించిన 18 తాం డాలలో మౌలిక వసతులను ఏర్పా టు చేయడం జరుగుతుందని తెలి పారు. ఈ గ్రామాలలో వన్ ధన్ విక్రయ కేంద్రాలను (వి డి వి కె) ఏర్పాటు చేయడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరి చేందుకు చర్యలు తీసుకుంటామ న్నారు.
గుర్తించిన తండాలలో రహదారు లు, విద్యుత్, తాగునీరు ,విద్య, వై ద్య సదుపాయాలు, స్వయం ఉపా ధి, వ్యవసాయ అనుబంధ రంగా లు, ఇతర రంగాల ద్వారా జీవనో పాధి అవకాశాలను కల్పించడం జరుగుతుందని వెల్లడించారు.ఈ మూడు మండలాలలో గుర్తిం చిన 18 గ్రామాలలో తండాలలో తాగునీటి ట్యాంకులు లేని చోట సంపుల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించాలని, అదేవిధంగా ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇచ్చే విధం గా ప్రతిపాదనలను రూపొందిం చాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారు లను ఆదేశించారు.
అలాగే సోలార్ మోటార్ పంపుల ద్వారా తాగునీరు ఇచ్చేలా ప్రణాళి క,అంచనాలు రూపొందిం చాలన్నా రు. సంప్రదాయ పద్ధతిలో ఇందిర మ్మ ఇండ్లు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్ ను ఆదేశించా రు. రెడ్ కో ద్వారా సోలార్ లైట్లు, సోలార్ పంప్స్, స్ట్రీట్ లైట్లు, వ్యక్తిగ త పంపు సెట్లు, వ్యవసాయ మో టార్ పంపుల ఏర్పాటుకు ప్రతిపాద నలు రూపొందించాలని జిల్లా మేనే జర్ ను ఆదేశించారు. ఐసిడిఎస్ ద్వారా అంగన్వాడి కేంద్రాలు లేని చోట అంగన్వాడి కేంద్రాల నిర్మాణా నికి ప్రతిపాదనలను సిద్ధం చేయాల న్నారు. మత్స్యశాఖ ద్వారా ఇ న్సులేటెడ్ మత్స్య సేవా హనాలు, అలాగే ఐస్ బాక్సులు, చేపల పెంప కానికి పాండ్స్ నిర్మాణం , కమ్యూ నిటీ పరంగా చేపల పెంపకం, చేప ల ఉత్పత్తుల ద్వారా ఆదాయం ఆ ర్జించే విధంగా యునిట్లను ఏర్పా టు చేయాలని ఆదేశించారు.
వైద్య ఆరోగ్యశాఖ ద్వారా సబ్ సెంటర్లు లేని చోట సబ్ సెంటర్ లను ప్రతిపాదించాలని, మందుల పంపిణీకి వాలంటీర్లను నియమిం చేందుకు ప్రతిపాదనలను సమ ర్పించాలన్నారు. నల్గొండ జిల్లా కేం ద్రంలో చెంచుల కోసం వసతి గృ హం ఏర్పాటు చేసేందుకు ప్రతిపా దనలు తయారు చేయాలని పరీ క్షలు, శిక్షణ సమయాలలో గిరిజను లకు ఉపయోగపడే విధంగా ఈ వసతిగృహం ఉపయోగపడే విధం గా ఉండాలని జిల్లా గిరిజన సంక్షే మ అధికారిని ఆదేశించారు. వీట న్నిటికీ సంబంధించి వారం రోజుల్లో పూర్తిస్థాయిలో ప్రతిపాదనలు సమ ర్పించాలని, కలెక్టర్ ఆదేశించారు.
వీటన్నింటిని వన్ ధన్ విక్రయ కేంద్రాల ద్వారా అమలు చేయడం జరుగుతుందన్నారు. అన్ని ఇంజ నీరింగ్ శాఖల అధికారులు సైతం వారి శాఖలకు సంబంధించి ప్రతిపా దనలు సమర్పించాలన్నారు.
మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారా యణ అమిత్, గిరిజన సంక్షేమ శాఖ ఇంచార్జ్ అధికారి రాజ్ కుమా ర్, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, డిపిఓ వెంక య్య, మత్స్యశాఖ ఏ డి చరిత, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, పెద్దఊర తహసిల్దార్ శ్రీనివాస్ , ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, విద్యుత్ శాఖ ఇంజనీరింగ్ అధికా రులు, తదితరులు ఈ సమా వేశానికి హాజరయ్యారు.
మౌలిక వసతుల కల్పనకై అంచనాలు …. అనంతరం జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ గిరిజన తండాలలో మౌలిక వసతుల కల్పనకై అంచనా లను రూపొందించే నిమిత్తం సం బంధి త శాఖల అధికారులతో సమ న్వయ సమావేశం ఏర్పాటు చేయ డం జరిగిందని, దర్తి ఆబా యోజ న కింద సుమారు 95 కోట్ల రూపా యల వ్యయంతో నల్గొండ జిల్లాలో మౌలిక వసతుల కల్పనకు చర్య లు తీసుకుంటున్నామని చెప్పారు.
పూర్తిస్థాయిలో ప్రతిపాదనలు అం దిన తర్వాత రాష్ట్ర గిరిజన సం క్షేమ శాఖ కమిషనర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పం పించనున్నట్లు తెలిపారు.