సీఎం రేవంత్ కీలక వ్యాఖ్య, వారందరికీ ఒక్కో బ్రాండ్, నాది యంగ్ ఇండియా
CMrevathreddy: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలుగు రాష్ట్రా ల్లో ఆ కొద్దిమంది తీసుకున్న నిర్ణయాలు చరిత్రను మలుపు తి ప్పా యని, ముఖ్యమంత్రుల్లో ఒక్కొ క్కరికి ఒక్కో బ్రాండ్ ఉందని చెప్పు కుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. రూ.2 కిలో బియ్యం తో ఎన్టీఆర్ ప్రతీ పేదవాడి మనసు లో స్థానం సంపాదించుకున్నా రని, హైదరాబాద్‌లో ఐటీని అభివృద్ధి చేసి చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారని ముఖ్యమంత్రి కొనియాడుతూనే రైతు బాంధవుడిగా ప్రజలు వైఎస్‌ను గు ర్తుంచుకుంటారని, అలాగే ఇవాళ తాను క్రియేట్ చేసిన తన బ్రాండ్ ‘యంగ్ ఇండియా’ మహా త్ముడి స్ఫూర్తితో యంగ్ ఇండియా బ్రాండ్ ను తెలంగాణలో క్రియేట్ చేసుకు న్నామని పేర్కొన్నారు.
యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఇది ప్రతీ పోలీస్ సిబ్బందికి అత్యం త ముఖ్యమైనదని, ఎన్నికల మేని ఫెస్టోలోనే పోలీస్ స్కూల్ అం శాన్ని పొందుపరిచామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొ న్నారు. గురు వారం రంగారెడ్డి జిల్లా మంచిరేవు లలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా సీఎం మాట్లాడుతూ ఆనాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ సారథ్యంలో దేశంలో యూనివర్సిటీల పునాదు లు పడ్డాయని, నె హ్రూ దార్శనికత తోనే మన దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థా యికి చేరిందన్నారు.
దేశ చరిత్రలో ఎంతో మంది ప్రధా నులు, ముఖ్యమంత్రులు అయ్యా రని, కానీ అందులో కొద్ది మంది మాత్రమే చరిత్రలో గుర్తుండిపోయా రని అన్నారు. దేశ భవిష్యత్ తర గతి గదుల్లోనే ఉందని, అందుకే ఎడ్యుకేషన్, ఎంప్లాయిమెంట్ అనే ది మా బ్రాండ్ అని, నిరుద్యోగు ల్లో సాంకేతిక నైపుణ్యంలో శిక్షణ అం దించేందుకు యంగ్ ఇండియా స్కి ల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసు కున్నామన్నారు.
ఆనంద్ మహేంద్రను యూనివర్సి టీకి చైర్ పర్సన్‌గా నియమించుకు న్నామని, ఇవాళ యూనివర్సిటీలో చేరిన ప్రతీ విద్యార్థికి ఉద్యోగ భద్ర త ఉందని, దేశంలోనే ది బెస్ట్ యూ నివర్సిటీగా యంగ్ ఇం డియా స్కి ల్స్ యూనివర్సిటీని తీర్చిదిద్దేందు కు ప్రయత్నిస్తున్నా మని సీఎం రేవం త్ రెడ్డి పేర్కొన్నారు. వచ్చే ఒలంపి క్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పో ర్ట్స్ యూనివర్సిటీ, అకాడమీని ఏ ర్పాటు చేసుకోబోతున్నామని చె ప్పారు. ప్రతీ నియోజకవర్గంలో 25 ఎకరాల విస్తీర్ణంలో యంగ్ ఇండి యా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తు న్నామ న్నారు.
ప్రాథమిక స్థాయిలో నే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ను చేర్చుకో కపోవడంతో విద్యార్థు ల సంఖ్య తగ్గుతుతోందన్నారు. ఒక టో తరగ తి నుంచి ఉన్న ప్రభుత్వ స్కూల్స్ విధానంలో మార్పులు తీ సుకొచ్చి ప్రీ-స్కూల్ విధానాన్ని తీ సుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసు కుందని అన్నారు. సైనిక్ స్కూ ల్కు ధీటుగా పోలీస్ స్కూల్‌ను తీ ర్చి దిద్దాలని ఇందుకు కావాల్సిన నిధులు ప్రభుత్వం ఇవ్వడానికి సి ద్ధం గా ఉందని సీఎం స్పష్టం చేశారు.
పోలీస్ స్కూల్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దడం మనందరి బాధ్యతని సామాజిక బాధ్యతగా ప్రైవేటు కం పెనీలు పోలీస్ స్కూల్‌కు ఆర్ధిక సా యం అందించాలని కోరారు. పోలీ స్ స్కూల్ కోసం రూ. 100 కోట్ల కార్పస్ ఫండ్ క్రియేట్ చేసుకోవాల ని, ఇందుకు అవసరమైన అనుమ తులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం గా ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్ప ష్టం చేశారు.