Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Gold Prices : బంగారం ధరలదరువు, ఆల్ టైం రికార్డుతో మరింత పెరిగిన పసిడి

Gold Prices : ప్రజా దీవెన, హైదరాబాద్: దేశంలో పసిడి ధరలు మరోసారి షాక్ ఇ చ్చాయి. బంగారం ధర వరుసగా రెండోసారి గురువారం భారీగా పెరి గింది. ప్రధానంగా అమెరికా-చైనా మధ్య పెరుగుతున్న వాణిజ్య ఉద్రి క్తతల కారణంగా వీటి ధరలు పుం జుకున్నాయి. అమెరికా, చైనా దేశా లు ఒకదానిపై మరొకటి సుంకాల ను ప్రకటిస్తున్న నేపథ్యంలోనే బం గారం ధరలు పెరగడం విశేషం. ఈ క్రమంలో ఏప్రిల్ 10, 2025న హై దరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.2,940 పెరిగి, రూ.93,380కి చేరింది. అం టే 100 గ్రాములకు ఏకంగా రూ.2 9,400 పెరిగింది. మరోవైపు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 2,700 పెరిగింది, రూ.85,600కి చేరుకుంది. ఇక 18 క్యారెట్ల బం గారం ధర కూడా వరుసగా రూ. 2,210 పెరిగి, ప్రస్తుతం రూ.70, 040 స్థాయికి చేరుకుంది.

హెచ్చుతగ్గులెందుకో తెలు సా… ఈ బంగారం ధరల పెరు గుదల ప్రధానంగా అమెరికా అ ధ్యక్షుడు ట్రంప్ సుంకాల విషయం లో వెనక్కి తగ్గడం సహా యుద్ధ పరిస్థితులు, ఎకానమీ మీద ప్రభా వం చూపించాయి. దీంతో పసిడికి జాతీయ డిమాండ్ కూడా పెరిగిం ది. ఇలాంటి అంశాలు మార్కెట్ పరిస్థితులను ప్రభావితం చేయడం తో బంగారం ధరలు పైపైకి చేరా యి. ఈ క్రమంలో గత వారం పడి పోయిన ధరలను మళ్లీ పుంజుకునే లా చేశాయి. దీంతో సామాన్యులు ఇప్పుడు పసిడి కొనుగోలు చేయా లంటే ఆలోచించే పరిస్థితి ఏర్ప డింది.

మరింత పెరగనున్నాయా…
వాణిజ్య యుద్ధంతో పాటు, భవి ష్యత్ ఆర్థిక సంక్షోభంపై అనిశ్చితి కూడా బంగారం ధరలను ప్రభావి తం చేసింది. రిస్క్ సెంటిమెంట్లు అంటే ఆర్థిక పరిస్థితులపై అనిశ్చి తి, ఇన్వెస్టర్లను బంగారం లాంటి సురక్షిత పెట్టుబడుల వైపు ఆకర్షి స్తోంది. వడ్డీ రేట్ల అంచనాలు తగ్గ డం, ద్రవ్యోల్బణం వంటి అంశాలు కూడా బంగారం ధరలను ప్రభావి తం చేశాయి. భవిష్యత్‌లో అమెరి కా, చైనా మధ్య సుదీర్ఘ వాణిజ్య యుద్ధం కొనసాగితే, బంగారం ధర లు మరింత పెరిగే అవకాశం ఉం దని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

వెండి ధరలు సైతం అదేదా రిలో హైదరాబాద్‌లో వెండి ధ రలు కూడా ఈ రోజు భారీగా పెరి గాయి. వెండి ధర ఒక కిలోకు రూ. 2,000 పెరిగి రూ.1,04,000 వద్ద ట్రేడవుతోంది. అలాగే, 100 గ్రాము ల వెండి ధర రూ.200 పెరిగి రూ. 10,400కి చేరుకుంది. ఇది బంగా రం ధరల పెరుగుదలతో పాటు స మన్వయం అయ్యి, వెండి కూడా ఒక లాభం సాధించడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా బంగారం సు రక్షితమైన పెట్టుబడిగా మారింది, అందుకే ఇన్వెస్టర్లు బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.