Jayashankarbadibata: ప్రజా దీవెన, మునుగోడు: మునుగో డు మండలం రత్తిపల్లి గ్రామం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో శుక్రవారం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహించారు. వేసవి కాలం సెలవుల కారణంగా ముందస్తుగా ఇం గ్లీష్ మీడియం లో అడ్మి షన్లు కొనసాగుతున్నందున ప్రభుత్వ పాఠ శాలను బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా బడిబాట కార్యక్ర మం నిర్వహించారు.
గ్రామంలో ఉన్న పాఠశాలలో విద్యా ర్థుల సంఖ్యను పెంచి ప్రభుత్వం అందించే నాణ్యమైన విద్యను పొం దాలని గ్రామ ప్రజలకు అవగా హన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపా ధ్యాయులు న ర్సిరెడ్డి, ఉపాధ్యాయురాలు ఆయేషా , రత్తిపల్లి మాజీ సర్పంచ్ మాధ గోని రాజేష్ గౌడ్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ జ్యోత్స్న, అంగ న్వాడీ టీచర్ మంగమ్మ, తంగళ్ళ యాదగిరి రెడ్డి, బొమ్మగోని వెంకన్న జిట్టగోని స్వామి, రాసమల్ల సైదు లు, రసమల్ల అంజి, బోడ్డుపల్లి వెంకటయ్య, ధనమ్మ మరియు గ్రామ ప్రజలు విద్యార్థుల తల్లిదం డ్రులు పాల్గొన్నారు.