Phule Jayanti : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్:మహాత్మా జ్యోతి రావు ఫూలే 199 వ జయంతి కార్యక్రమాన్ని నల్గొండ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కా ర్యాలయంలో శుక్రవారం నల్గొండ నియోజకవర్గ మాజీ ఇంచార్జి ఎల్ వి యాదవ్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి, క్లాక్ టవర్ సెంటర్ లో విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు ఫూలే సు మారు 175 సంవత్సరాల క్రితమే ఆయన సతీమణి సావిత్రిబాయి ఫూలే తో కలిసి బడుగు, బలహీన వర్గాలు, దళితులు, మహిళల అభి వృద్ధి కోసం పాఠశాలలు స్థాపించి సావిత్రిబాయి ఫూలేను ఉపాధ్యా యురాలుగ చేసి అనేక మందికి వి ద్యనందిచిన ఘనత ఆయనది అన్నారు.
విద్య ఉంటేనే అణగారిన వర్గాలు, మహిళలు అభివృద్ధి చెందుతారని ఉద్దెశంతోనే విద్య అభివృద్ధి కోసం కృషి చేసిన మహానుభావుడు. అం టరాని తనం నిర్ములన కోసం, వి తంతు వివాహాలు, బడుగు, బల హీన వర్గాల సంస్కరణల కోసం నిత్యం కృషి చేసిన మహాత్ముడు అన్నారు.
వారి ఆశయబాటలోనే NTR తెలుగుదేశం పార్టీ ని స్థాపించి బడుగు, బలహీన వర్గాల, దళిత వర్గాల కోసం కృషి చేసిన నాయ కుడు ఎన్టీఆర్ అని ఎన్ టి ఆర్ అడుగుజాడల్లోనే చంద్ర బాబు నా యుడు కూడా బడుగు, బలహీన వర్గాల కోసం కృషిచేస్తున్నారన్నా రు. మహాత్మా జ్యోతి ఫూలే ఆశ యాల కోసం తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కృషిచేస్తుందన్నారు.
ఈ కార్యక్రమం లో పార్టీ కూరెళ్ల విజయ్ కుమార్, ఆకునూరి సత్యనారాయణ, గుండు వెంకటేశ్వర్లు, జంపాల చంద్రశేఖర్, గంగాధర్ స్వరాజ్, గోవిందు బాలరాజ్, కాంచనపల్లి క్రాంతికుమార్, శ్రావణి నందిశ్వర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.