సర్కారు బడి పిలుస్తోంది… రా .. కదలిరా : మార్కండేయులు.
Government schools :ప్రజా దీవేన, కోదాడ: పట్టణంలో స్థానిక పీఎం శ్రీ జడ్పీ బాయ్స్ హై స్కూల్ , శ్రీనగర్ కాలనీ ప్రాథమిక పాఠశాల యందు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించినారు.. పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు డి. మార్కండేయ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడినారు.ప్రభుత్వ బడిలో కల్పిస్తున్న సౌకర్యాలు ఉచిత పుస్తకాలు, ఉచితంగా నోట్ బుక్స్, రెండు జతల దుస్తులు, మధ్యాహ్నం పూట భోజనం, ఉదయం పూట పలహారం రాగి జావ ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను వివరించినారు.
ఈ అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు శ్రీనగర్ కాలనీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులను కలిసి 5వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులను తమ హైస్కూల్లో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. తమ పాఠశాలలో సైన్స్ ల్యాబ్, లైబ్రరీ విశాలమైనతరగతి గదులు, క్రీడామైదానం, స్వచ్ఛమైన తాగునీరు సౌకర్యం, అర్హత అనుభవం అంకితభావం గల ఉపాధ్యాయుల చేత డిజిటల్, ఏఐ కృత్రిమ మేధా సంపత్తి అనుసంధానంతో బోధన జరుగుతున్నదని, తెలుగు, ఇంగ్లీష్ మీడియం లో ప్రవేశాలు జరుగుతున్నాయని తెలియజేసినారు.
ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. సర్కారు బడి పిలుస్తోంది.. రా… కదలిరా.. పాఠశాలలో ఉన్న సౌకర్యాలు కల్పిస్తున్న మౌలిక వసతులు గురించి తెలియజేస్తూ ప్లెక్సీ, కరపత్రం తో ఉపాధ్యాయులు 2025 -26 విద్యా సంవత్సరం బడిలో పిల్లలను చేర్పించడం గురించి ముందస్తుగానే ప్రచారం మొదలుపెట్టి అడ్మిషన్లు పెంచడంపై దృష్టి పెట్టినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు డి. మార్కండేయ, శ్రీనగర్ కాలనీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి. భూపాల్ రెడ్డి, ఉపాధ్యాయులు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.