Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BRSJagadishReddy : వరంగల్ సభ చారిత్రాత్మకం

--25 ఏళ్ల బిఆర్ఎస్ పండగకు వెల్లువలా జనసంద్రం  --సభ పెట్టడంలో నల్లగొండ ది గిన్నిస్ రికార్డ్ లమయం  --కోమటిరెడ్డి అనుచరుల దుర్మార్గలతో జిల్లా సర్వనాశనం --కాంగ్రెస్ పాలనలో రైతన్నల పరిస్థితి ఆగమ్యగోచరం --ప్రజల సహనం నశిస్తే కోమటిరెడ్డిని  అడుగుపెట్టనివ్వబోo --మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి తీవ్రవ్యాఖ్యలు

 

BRSJagadishReddy :ప్రజాదీవెన నల్గొండ :వరంగల్ లో ఈ నెల 27న వరంగల్ లో నిర్వహించే బిఆర్ఎస్ 25 ఏండ్ల రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోతుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా కేం ద్రంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తో కలిసి నల్లగొండ ని యోజకవర్గ కార్యకర్తల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. 25 ఏళ్ల బిఆర్ఎస్ పండుగకు వెలువల జనాలను తరలివచ్చేందుకు సన్నద్ధం అవుతు న్నారని పేర్కొన్నారు.

సభలు పెట్టడం లో నల్గొండ జిల్లా ది గిన్నిస్ రికార్డ్ సొంతమని పేర్కొ న్నారు. పార్టీ పెట్టినప్పుడు టిడిపి అధినేత చంద్రబాబు లాంటి వారు బిఆర్ఎస్ ఉండదు, మధ్యలోనే బంద్ అయితది అని శాపనార్థాలు పెట్టిండని గుర్తు చేశారు. మొదటి వార్షికోత్సవ సభ నల్గొండ లొ పెట్టి సూపర్ సక్సెస్ చేసి ఎన్నో మైలు రాళ్లనను అదిరోహించినట్లు తెలి పారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తామని చెప్పి మోసం చేస్తే మన పిల్లలు ఆత్మబలిదానాలు చేసుకున్నారని ఆవేదన చెందారు. తెలం గాణ వాదం ఉందని నల్గొండ జిల్లాలో ఎన్నో సభలు పెట్టినం. ఉద్య మంలో నల్గొండ జిల్లా స్థానం పదిలం. నల్గొండ జిల్లా ఉద్యమాల జిల్లా అని అన్నారు. ఇక నల్గొండ జిల్లా మంత్రి కోమటిరెడ్డి కోతల మంత్రిగా మారిండని విమర్శించారు.

కోమటిరెడ్డి ఒత్తి చేతకాని మంత్రి, వీళ్ళ చేతకాని తనం వల్లనే రైతు లపై మిల్లర్లు, దళారులు దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. మిర్యాలగూడలో మద్దతు ధర ఇవ్వమని అడిగితే మిల్లర్లు దళా రులు కలిసి రైతులపై దాడులకు దిగుతున్నారని, సూర్యపేట లో ఓ రైతు మద్దతు ధర రాక ధాన్యం రాశులకు నిప్పు పెట్టుకున్నాడని ఆవేదన చెందారు.

కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎ స్ఎల్బీసీని శాశ్వతంగా మూసి వేసే కుట్ర చేస్తున్నారు. ఈ దద్దమ్మ లకు ఎస్ ఎల్ బి సి ని పూర్తి చేసే దమ్ము లేదని మండిపడ్డారు. సీ ఎం రేవంత్ రెడ్డి ని ఎన్ని రోజులు భరించాలని ప్రజలు బాధప డుతు న్నారని అన్నారు.కేసీఆర్ ఉన్నన్ని రోజులు రైతులు దైర్యంగా వున్నా రు.ప్రతి రైతు గుండెల్లో కెసిఆర్ ఉన్నారని అన్నారు.తాగుబోతు కాం గ్రెస్ నాయకులకు, అక్రమ కేసులకు భయపడమని స్పష్టం చేశారు. వాళ్ళు చేసే పనులన్నింటికీ వడ్డీతో సహా చెల్లిస్తామని పేర్కొన్నారు.

మంత్రులు దందా లో మునిగి తేలుతున్నారు. కోమటిరెడ్డి అనుచ రుల దుర్మార్గులాతో నల్గొండ జిల్లా సర్వ నాశనం అయ్యింది.ప్రజల సహనం నశిస్తే కోమటిరెడ్డి ని నల్గొండ కు కూడా రానివ్వరని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అనుచరులు చేయని దందా లేదని, ప్రభుత్వ వసతి గృహాలలో కల్తీ నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తూ విద్యా ర్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. కోమటి రెడ్డి ఇది దుర్మార్గమైన చర్య అన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నా రని, కెసిఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు.

వరంగల్ సభ చరిత్రలో నిలిచిపోతుందని స్పష్టం చేశారు. ఈ కార్య క్రమంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల గోపాల్ రెడ్డి, నాయకులు చకిలం అనిల్ కు మార్,మల్లికార్జున రెడ్డి, కృష్ణా రెడ్డి, సైదిరెడ్డి, యట జయప్రద రెడ్డి, శరణ్య, కరీం పాషా, వసుదేవ రెడ్డి, సత్తయ్య గౌడ్ తదితరులు పా ల్గొన్నారు.