— ముగింపు రోజు శ్రీశైలం ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్
Srisailam Traffic : ప్రజా దీవెన ,అచ్చంపేట: దక్షిణ తెలంగాణ అమర్నాథ్ గా ప్రఖ్యాతి గాంచిన సలేశ్వరం లింగమయ్య జాతర వేడుకలు ఆదివారంతో ముగిశాయి. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లింగాల మండలం రాంపూర్ పెంట సమీపం లోని అమ్రాబాద్ పులుల అభయా రణ్యం పరిధిలోని నల్లమల కొండ ల్లో ఈ ఆలయం కులువుదీరిన విషయం అందరికీ తెలిసిందే. ప్రతి ఏడాది చైత్ర పౌర్ణమి సందర్భంగా మూడు రోజుల పాటు నిర్వహించే సలేశ్వరం లింగమయ్య జాతర ఈ క్రమంలోనే ఈ ఏడాది విజయవం తంగా కొనసాగిన వేడుకలు ఆది వారంతో ముగిశాయి. ఈ నెల 11 నుంచి 13 వరకు జాతర అత్యంత ఘనంగా నిర్వహించారు.
అభయా రణ్యం పరిధిలో ఆలయం ఉండ డంతో అటవీ శాఖ అనుమతు ల తో జాతర నిర్వహించారు. మూడు రోజుల పాటు నిర్వహించిన జాతర వేడుకలు తిలకించేందుకు తెలంగా ణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారా ష్ట్ర చెందిన వేలాది మంది భక్తులు లింగ మయ్య స్వామిని దర్శించుకు న్నారు. వివిధ మార్గాల ద్వారా రాం పూర్ పెంట వరకు చేరుకున్న భక్తు లు అక్కడి నుండి కాలిన డకన ఆ లయానికి చేరుకున్నారు. దట్టమైన అభయారణ్యంలో కొండలు, కోన లు, రాళ్లు, రప్పలు దాటుకుంటూ కర్రల సహా యంతో ఆలయానికి చేరుకునే సమయంలో వస్తున్నాం వస్తున్నాం లింగమయ్య, దర్శనం తర్వాత తిరుగు ప్రయాణంలో వె ళ్లొస్తాం, మళ్లొస్తాం లింగమయ్య అంటూ శివ నామస్మ రణతో సాగే యాత్ర ప్రతిభక్తుని మదిలో చిరస్మర ణీయంగా నిలిచిపోతుంది. మూడు రోజుల వ్యవధిలో రెండు లక్షల మందికి పైగా భక్తులు ఆలయాన్ని దర్శించుకుని ఉంటారని అధికా రులు అంచనా వేస్తున్నారు.