— ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి పిలుపు
Social Justice : ప్రజాదీవెన నల్గొండ : స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు దాటిన నేటికీ సమాజంలో వివక్షత, అంటరానితనం పెచ్చరిల్లుతుందని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సూచించిన విధంగా సమాజంలో అందరూ వివక్షత, అంటరానితనం లేని సమాజంకై పోరాడదాం అని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి పిలుపునిచ్చారు. మహిళా సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సామాజిక న్యాయ యాత్ర నిర్వహిస్తున్నట్టు అందులో భాగంగా మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రానికి జాత చేరుకున్న సందర్భంగా జరిగిన సభలో మాట్లాడారు. నేడు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుండి మతం, కులం పేరా దాడులు దౌర్జన్యాలు కొనసాగిస్తున్నారని మహిళలపై అనేక వివక్షత ప్రదర్శిస్తున్నారని అన్నారు. నేటికీ రాష్ట్రంలో రెండు గ్లాసుల విధానం, దేవాలయాల్లోకి రానివ్వక పోవడం, కులాంతర వివాహితులపై దారుణమైన హత్యలపరంపరా కొనసాగుతుందని ఆరోపించారు. వివక్షత లేని సమాజంకై మత ఉన్మాదుల దాడులకు వ్యతిరేకంగా ఐక్యంగా ప్రజలు కలిసి రావాలని కోరారు. విద్యా, వైద్యం ఉచితంగా పేదలందరికీ అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ జ్యోతి,రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు ప్రభావతి, కోశాధికారి యం. భారతి, కె ఎన్. ఆశలత, ఎండీ. శభానా, రాష్ట్ర సహాయ కార్యదర్శి సాయిలీల, స్వరూప, జ్యోతి నల్గొండ జిల అధ్యక్షులు పోలేబోయిన వరలక్ష్మి, కొండా అనురాధ, జిట్టా సరోజ, నిమ్మలా, పద్మ, బూతం అరుణకుమారి, తుమ్మల పద్మ, ఎస్.కె. సుల్తానా, ఊర్మిళ, అరుణ, ఇందిరా, శశికళ, తదితరులు పాల్గొన్నారు.