–జర్నలిస్టుల సంక్షేమానికి కోటి విరాళం
–తన జన్మదినo సందర్భంగా రూ. 25 లక్షల చెక్కు అందజేత
–అభినందించిన మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్
Malkajgiri MP Etala Rajendar: ప్రజా దీవెన కూకట్ పల్లి: నిత్యం ప్రజల పక్షాన పోరాటం చేసే జర్న లిస్ట్ యోధులకు కూకట్ పల్లి బిజె పి సీనియర్ నాయకులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వడ్డేపల్లి రాజే శ్వరరావు అండగా నిలిచారు. జర్న లిస్టుల సంక్షేమం కోసం, శాశ్వత నిధిని ఏర్పాటు చేసుకోవాలని సూ చించిన ఆయన కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. శనివారం నిర్వహించిన వడ్డేపల్లి రాజు ( రాజే శ్వరరావు ) జన్మదిన వేడుకల సం దర్భంగా రూ. 25 లక్షల చెక్కును మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేం దర్ ఆధ్వర్యంలో అందజేశారు. చాలీచాలని జీతాలతో ఇబ్బందు లు పడుతున్న జర్నలిస్టులను చూ సి తాను చెల్లించానని ఈ సంద ర్భంగా తెలిపారు.
తన సూచన మేరకు కూకట్పల్లి లోని సీనియర్ జర్నలిస్టులు ఏక తాటిపైకి వచ్చి కూకట్పల్లి జర్న లిస్టు మ్యూచువల్లీ ఎయిడెడ్ కోప రేటివ్ హౌసింగ్ సొసైటీని ఏర్పాటు చేసుకున్నారని హర్షం వ్యక్తం చేశా రు. తాను ఇస్తున్న కోటి రూపాయ లను జర్నలిస్టులు శాశ్వత అవస రాలైన భూమి కొనుగోలు కోసం సద్వినియోగం చేసుకోవాలని కో రారు.
ఈ సందర్భంగా మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ జర్నలిస్టు లకు అండగా నిలిచిన వడ్డేపల్లి రాజును అభినందించారు. నాయకులకు, జర్నలిస్టులకు ఎంతో విడదీయరా ని బంధం ఉంటుందని, ఈరోజు రా జు చేసిన పని మరింత బలోపేతం చేసిందని ఆశాభావం వ్యక్తం చేశా రు. జర్నలిస్టులు తమ సొంత కు టుంబాలను సైతం వదిలేసి ప్రజల సమస్యలే పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తుంటారని కొనియాడారు. యాజమాన్యాల నుంచి వచ్చే జీతభత్యాలు అంతంతమాత్రం గానే ఉంటాయని అన్నారు.
జర్నలిస్టులకు పెద్ద మొత్తంలో డబ్బులను అందజేసేందుకు ముం దుకు వచ్చిన రాజు మనసు ఎంతో గొప్పది అన్నారు. భవిష్యత్తులో ఆ యన మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని జర్నలిస్టులకు అండగా నిలవాలని ఆకాంక్షించా రు.
ఈ కార్యక్రమంలో హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు గడ్డమీది బాలరాజు, ప్రధాన కార్యదర్శి దయాసాగర్, కోశాధికారి ఎం ఏ కరీం, సీనియర్ జర్నలిస్టులు తొట్ల పరమేష్, నిమ్మల శ్రీనివాస్, విద్యా వెంకట్, నవీన్ రెడ్డి, వేణుమాధవ్, మాణిక్య రెడ్డి, నాగరాజు, లక్ష్మణ్, హరి, దా మోదర్, విష్ణు, రాము, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.