Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister Ponnam Prabhakar : త్వరలోనే ఆర్టీసీ లో 3038 ఉద్యో గాలకు నోటిఫికేషన్

–రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

Minister Ponnam Prabhakar : ప్రజా దీవెన , హైదరాబాద్ : తెలంగా ణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో త్వరలో 3038 ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఆర్టీసీ లో సుదీర్ఘ కాలం తర్వాత ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభిస్తుండడంతో మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్య క్తం చేశారు. 3038 ఉద్యోగాల భ ర్తీకి ఇప్పటికే ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని త్వరలోనే నోటిఫికేషన్ వేసి సాధ్యమైనంత త్వరలోనే ఉ ద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తా మని వెల్లడించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయ కత్వంలో ప్రజా పాలన ప్రభుత్వం ఆర్టీసీ లో మహిళలకు ఉచిత ప్ర యాణం అందిస్తుందని దీని ద్వారా ఆర్టీసీ లో మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిందని వెల్లడిం చారు. ఇప్పటి వరకు ఆర్టీసీలో 16 5 కోట్ల మంది మహిళలు ఉచితం గా ప్రయాణం చేశారని వారు 550 0 కోట్ల రూపాయలు ఆదా చేసిన ట్లు పేర్కొన్నారు.

ఇప్పటికే మహా లక్ష్మి కోసం కొత్త బ స్సులు కొనుగోలు చేశామని ఇప్పు డు ఉద్యోగాల భర్తీకి ఆర్టీసీ సన్న ద్ధం అయిందని పేర్కొన్నారు. మొ త్తం 3038 ఉద్యోగాలకు గాను
డ్రైవర్ 2000, శ్రామిక్ -743 డి ప్యూటీ సూపరిండెంట్ (ట్రాఫిక్) – 84 డిప్యూటీ సూపరిండెంట్ (మె కానికల్) – 114, డిపో మేనేజర్ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ – 25
అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ – 18, అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) – 23, సెక్షన్ ఆఫీసర్ ( సివిల్) -11
అకౌంట్ ఆఫీసర్స్ – 6 , మెడికల్ ఆఫీసర్స్ జనరల్ – 7, మెడికల్ ఆఫీసర్స్ స్పెషలిస్ట్ – 7 పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. ఇప్పటికే ప్రజా పాలన ప్రభుత్వం లో నిరుద్యోగులకు పెద్ద పీఠ వేస్తూ దాదాపు 60 వేలకు పై గా ఉద్యోగాలను భర్తీ చేసిందన్నా రు. ఇప్పుడు మరోసారి భారీస్థాయి లో ఉద్యోగాల నోటిఫికేషన్లు క్యా లండర్ ప్రకారం విడుదల చేయ నుందని నిరుద్యోగులు సద్వినియో గం చేసుకొని బాగా ప్రిపేర్ కావాలని సూచించారు. ఆర్టీసీ లో సుదీర్ఘ కా లం తర్వాత ఉద్యోగాల భర్తీ జరు గుతుండడంతో ముఖ్యమంత్రి రే వంత్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి భ ట్టి విక్రమార్కకి మంత్రి పొన్నం ప్రభా కర్ ధన్యవాదాలు తెలిపారు.