Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MLC Kalvakuntla’s poem : అప్పులపై డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క విపరీత అబద్దాలు

–ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులున్నా నిరుపయోగం
–కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణను కాపాడే బాధ్యత బీఆర్ఎస్ పార్టీదే
–కేసీఆర్ కి, పార్టీ కార్యకర్తలకు మధ్య వారిధిగా ఉంటాను
–ఏ చిన్న అవసరమున్నా నన్ను కా ర్యకర్తలు సంప్రదించవచ్చు
–మన కళ్ల ముందే తెలంగాణ ఆగ మవుతుంటే చూస్తూ ఊరుకోo
— పార్టీ సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

MLC Kalvakuntla’s poem :ప్రజా దీవెన, భద్రాచలం: అరవై ల క్షల మంది కార్యకర్తలున్న బీఆర్‌ఎ స్‌ పార్టీ అతిపెద్ద కుటుంబమని ఈ కుటుంబాన్ని మరింతగా పెద్దగా రూపుదిద్దుకోవాల్సిన బాధ్యత మ నందరిపై ఉందని ఎమ్మెల్సీ కల్వ కుంట్ల కవిత పేర్కొన్నారు. సోమ వారం భద్రాచలంలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్త లు, తెలంగాణ ఉద్యమకారుల స మావేశంలో ఆమె పాల్గొని కార్యక ర్తలకు భరోసానిచ్చారు. పార్టీ అధి నేత కేసీఆర్‌కి కార్యకర్తలకు మధ్య వార ధిగా తానుంటానని హామీ ఇ చ్చారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారా నికి కృషి చేస్తానన్నారు. ఎవరికి ఏ చిన్న అవసరం వచ్చినా తనను సంప్రదించవచ్చన్నారు.

కార్యకర్తలను కాపాడుకోవడాన్ని బాధ్యతగా స్వీకరిస్తానని తెలిపా రు. సాధించుకున్న తెలంగాణ రా ష్ట్రాన్ని కాపాడుకోవడమే బీఆర్‌ ఎస్‌ కార్యకర్తల ప్రథమ కర్తవ్యమని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ కబంధ హ స్తాల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. మనందరి కళ్ల ముం దే తెలంగాణ ఆగమవుతుంటే చూ స్తూ ఊరుకోవద్దన్నారు. మనం కాస్త ఏమరపాటుగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణను ఆగం చేస్తుంద ని హెచ్చరించారు. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలందరినీ సమీక రించాల్సిన అవసరం ఉందన్నారు. మోసపోతే గోస పడుతామన్న విష యాన్ని కేసీఆర్‌ పదే పదే చెప్తారని గుర్తు చేశారు.

మోసం చేయడమే కాంగ్రెస్‌ పార్టీ నైజమన్న విషయం రాష్ట్ర ప్రజలకు మరోసారి తెలిసివచ్చిందన్నారు.
ఖమ్మం జిల్లా నుంచి రాష్ట్ర కేబినెట్‌ లో ముగ్గురు మంత్రులున్నా జిల్లా కు మూడు పైసలు కూడా తేలేద న్నారు. నిరుపేదలకు ఆత్మీయ భ రోసా కింద ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్‌ పార్టీ ఏ ఒక్కరికి సాయం చేయకుండా మోసం చేసిందన్నా రు. రాష్ట్ర అప్పులపై ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క విప రీతమైన అబద్ధాలు చెప్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌ గద్దెనెక్కిన తర్వా త తెచ్చిన రూ.1.60 లక్షల కోట్ల అ ప్పులను ఎందుకు ఖర్చు చేశారంటే సమాధానం చెప్పకుండా ప్రభుత్వం బుకాయిస్తుందన్నారు.

తెచ్చిన అప్పులను ఏయే పనుల కోసం ఖర్చు చేశారో ప్రభుత్వం ప్రజ లకు సమాధానం చెప్పి తీరాలన్నా రు. అప్పటి వరకు ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామన్నారు. రూ. 40 వేల కోట్ల విలువైన కంచ గచ్చి బౌలి భూములను రూ.10 వేల కో ట్లకు ప్రభుత్వం తాకట్టు పెట్టిందని.. ఆ డబ్బులు తెచ్చి రైతు భరోసా ఇ చ్చామని, రైతు రుణాలు మాఫీ చే శామని ప్రభుత్వ పెద్దలు చెప్తున్నార ని వివరించారు. అదే నిజమైతే ఇ ప్పటికీ 60 శాతం మంది రైతులకు ఎందుకు రుణమాఫీ కాలేదు, సగం మంది రైతులకు రైతుభరోసా డ బ్బులు ఇవ్వలేదో సమాధానం చె ప్పాలన్నారు. రూ.10 వేల కోట్లు ఎక్కడికిపోయాయి, ఎమయ్యా యో ప్రభుత్వం చెప్పి తీరాలన్నా రు. అప్పులతో పాటు రాష్ట్ర ఖ జానాను ఎందుకు ఖర్చు చేస్తు న్నారని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఎక్క డికక్కడ నిలదీయాలని పిలుపు నిచ్చారు.

2004లో చచ్చిన పీనుగలా ఉన్న కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. అప్పుడే తెలంగాణ ఇస్తామని మాట ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ కాలయాపన చేయడంతోనే వందలాది మంది బిడ్డలు ఆత్మబలి దానాలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్ష, యువత బలిదానా లతోనే కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇ చ్చింది తప్ప ఉట్టిగనే ఇవ్వలేదన్నా రు. ఇప్పుడు రాష్ట్రాన్ని పాలిస్తున్న వ్యక్తులు చూడడానికి మాత్రమే తె లంగాణ వాళ్లలాగా కనిపిస్తారని.. కానీ వాళ్లు పని చేసేది తెలంగాణ కు వ్యతిరేకంగానని తేల్చిచెప్పారు. వందలాది హామీలిచ్చి, కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వ చ్చిన కాంగ్రెస్‌ నిలదీయాలన్నారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి 16 నెలలు గడిచినా ఏ ఒక్క హామీని పూర్తిగా నెరవేర్చలేదన్నారు. తెలం గాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దే శంలోనే నంబర్‌ వన్‌ గా నిలబెట్టిన ఘనత కేసీఆర్‌ ది అన్నారు. రాష్ట్రా భివృద్ధి కోసం ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా కష్టపడి ప ని చేశారన్నారు. ఖమ్మం జిల్లాలో 3.50 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేందు కు కేసీఆర్‌ సీతారామ ఎత్తిపోతల పథకం పనులు చేపట్టి మెజార్టీ ప నులను పూర్తి చేశారని తెలిపారు. తెలంగాణకు ఎప్పటికైనా బీఆర్‌ఎ స్‌ పార్టీనే శ్రీరామ రక్ష అన్నారు. 1969లో ఖమ్మం జిల్లాలో పుట్టిన తెలంగాణ ఉద్యమం కొద్ది రోజులకే రాష్ట్రమంతా వ్యాపించిందన్నారు.

బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి కాంగ్రెస్‌ లో చేరిన భద్రాచలం ఎమ్మెల్యే తె ల్లం వెంకట్రావు ఉద్యమ ద్రోహి అ న్నారు. తెలంగాణ ఉద్యమ సమ యం నుంచి ఎందరో అలాంటి ద్రో హుల కుట్రలను చూశామన్నారు. త్వరలోనే భద్రాచలం నియోజకవ ర్గానికి ఉప ఎన్నిక వస్తుందని, ఆ ఎ న్నికల్లో గెలుపు బీఆర్‌ఎస్‌ దేనని స్పష్టం చేశారు.

భద్రాచలం సీతారాములకు ప్రత్యేక పూజలు ఎమ్మెల్సీ కల్వ కుంట్ల కవిత సోమవారం ఉదయం భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వా మి వారి ఆలయంలో ప్రత్యేక పూజ లు చేశారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్సీ కవితకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికా రు. ఆమెతో సంప్రదాయ బద్ధంగా పూజలు చేయించారు. అనంతరం వేద ఆశీర్వచనం చేసి తీర్థప్రసా దాలు అందజేశారు.