హిరోషిమా ప్రిఫెక్చరల్ అసెంబ్లీని సందర్శించిన తెలంగాణ బృందం
CMRevathreddy: ప్రజా దీవెన, హిరోషిమా: జపాన్ పర్యటన లో భాగంగా ముఖ్య మం త్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ ప్రతినిధి బృందం హిరో షిమా ప్రిఫెక్చరల్ అసెంబ్లీ (Hiros hima Prefectural Assembl y)ని సందర్శించింది. ముఖ్యమంత్రి తో పాటు మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు ఉన్నారు. హిరోషిమా ప్రిఫె క్చరల్ అసెంబ్లీ స్పీకర్ తకాషి నకమోటో, అసెంబ్లీ ప్రతినిధులు తెలం గాణ బృందానికి ఘన స్వాగతం పలికారు.
హిరోషిమా ప్రిఫెక్చరల్ అసెంబ్లీ ప్రతి నిధుల సమావేశాన్ని ఉద్దేశించి ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడు తూ, “హిరోషిమాకు రావడా న్ని గౌరవంగా భావిస్తున్నాను. హిరో షిమా అంటే నమ్మకానికి, పున ర్ని ర్మాణానికి చిహ్నం. ప్రజల ఐక్యత తో ఏదైనా సాధ్యమని నిరూపిం చి న నగరం నగరం ఇది. హిరోషిమా మాదిరిగానే ప్రజలు ఆశలు, ఆకాంక్షలు, పోరాటానికి చిహ్నం తెలంగాణ. సకలజనుల పోరాటం తో విజ యం సాధించిన రాష్ట్రం మాదని అన్నారు.
మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, “తెలంగాణ బృందం హిరోషిమా సందర్శన కేవలం పెట్టుబడుల కోసం మాత్రమే కాదు, పరస్పర సహకారం, భాగస్వామ్యాలకు కూడా ప్రాధాన్యత ఇస్తుంది. శాంతి, స్థిరత్వం, సమృద్ధి విలువలను పం చుకుందామని పిలుపునిచ్చారు.
జపాన్‌కు చెందిన 50కి పైగా కంపెనీ లు తెలంగాణలో విజయవం తంగా పనిచేస్తున్నాయి. క్లీన్ ఎనర్జీ, ఎల క్ట్రిక్ మొబిలిటీ, గ్రీన్ హై డ్రోజన్, మ్యానుఫాక్చరింగ్ రంగాల్లో మరి న్ని కంపెనీలను స్వాగ తిస్తున్నాం. తెలంగాణ భారతదేశానికి గేట్‌వే, ప్రపంచానికి అనుసం ధాన వేదిక. హిరోషిమా-హైదరాబాద్, జపాన్ తెలంగాణ మధ్య బలమైన సంబం ధాల వారధిని నిర్మిద్దామని మంత్రి అన్నారు.