Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

If you come to power, the next moment will be caste census: అధికారంలోకి వస్తే ఆ మరుక్షణమే కులగణన

--బిజెపి పాలనలో నిరుద్యోగం తారాస్థాయికి చేరింది --ఇండియా కూటమితోనే దేశంలో యువతకు ఉద్యోగ అవకాశాలు --నాగపూర్ లో కాంగ్రెస్ పార్టీ 139 వ వ్యవస్థాపక దినోత్సవం భారీ బహిరంగ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ

అధికారంలోకి వస్తే ఆ మరుక్షణమే కులగణన

–బిజెపి పాలనలో నిరుద్యోగం తారాస్థాయికి చేరింది
–ఇండియా కూటమితోనే దేశంలో యువతకు ఉద్యోగ అవకాశాలు
–నాగపూర్ లో కాంగ్రెస్ పార్టీ 139 వ వ్యవస్థాపక దినోత్సవం భారీ బహిరంగ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ

ప్రజా దీవెన/నాగ్ పూర్: భారతదేశం కేంద్ర ప్రభుత్వం లోకి అధికా రంలోకి వస్తే కుల గణనను నిర్వహిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహు ల్ గాoధీ ( Congress leader Rahul Gandhi said that caste census will be conducted) పునరుద్ఘాటిం చారు. రాజకీయ అధికారం కోసం జరిగే పోరాటానికి సిద్ధాంతమే పునాది అని, సామాన్యులకు అధికారాన్ని అప్పగించడమే కాంగ్రెస్ లక్ష్యమని స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ చాలామంది ప్రజలను మళ్లీ పేదరికంలోకి నెట్టిందని ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ పార్టీ 139 వ వ్యవస్థాపక దినోత్సవం పురస్కరించుకొని మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. భారతీయ జనతా పార్టీ పాలనలో దేశంలో నిరుద్యోగం గరిష్ట స్థాయికి చేరిందని ( Under the rule of the Bharatiya Janata Party, unemployment in the country has reached its highest level) ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిభ ఆధారంగా కాకుండా అనుకూలమైన వారికి విశ్వవిద్యాలయాల వైద్యశాల బాధ్యతలు కట్టబడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని విమర్శించారు.

ఇండియా కూటమి ఒక్కటే దేశ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించగలదని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ మాదిరి కాకుండా తమ పార్టీలో ఒక సాధారణ కార్యకర్త కూడా నాయకత్వాన్ని ప్రశ్నించగలడన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీటిని భారతీయ జనతా పార్టీ తన గుప్పిట్లో ( Bharatiya Janata Party has all the democratic systems under its cover) పెట్టుకుంటుందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ఇండియా కూటమి ఐక్యంగా ఉంటే భాజపా ఎక్కడ కనిపించదని పేర్కొన్నారు. అందుకే ఇండియా కూటమిని విడగొట్టేందుకు భాజపా విశ్వ ప్రయత్నాలు ( BJP’s global efforts to break the alliance of India) ప్రారంభించిందని ఆరోపించారు. దేశాన్ని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ఇండియాకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు.

తాము అధికారంలోకి వస్తే న్యాయ పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు ఒక భాజపా ఎంపీని రక్షించేందుకు 146 మంది ప్రతిపక్షం ఎంపీ లను సస్పెండ్ చేశారని ఇటీవల పార్లమెంట్ లో జరిగిన ఘటనను గుర్తు చేశారు. తెలంగాణ, కర్ణాటకలో సాధించిన విజయాలు పార్టీలో నైతిక స్థైర్యాన్ని నింపాయని ( The victories achieved in Telangana and Karnataka have filled the morale of the party) ఇతర రాష్ట్రాల్లో ఇటీవల పరాజ్యాలను చూసి పడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే వంద రోజులు దేశానికి కాంగ్రెస్ పార్టీకి ఎంతో కీలకమని వ్యాఖ్యానించారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చేలా ఈ వంద రోజులు కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ప్రతి ఔషధానికి ఎక్స్పైరి డేట్ ఉంటుందని అదేవిధంగా దేశంలోనూ ఇకపై నరేంద్ర మోడీ ఔషధం పనిచేయదని ఎద్దేవా చేశారు. భారతీయ జనతా పార్టీ చెప్పుకునే డబ్బులు ఇంజన్ ప్రభుత్వం వాస్తవానికి ఆదాని ప్రధాని సర్కార్ అని విమర్శించారు.