— మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
MLA Komatireddy Rajagopal Reddy : ప్రజా దీవెన, మర్రిగూడెం: భూ భార తి చట్టం దేశంలోనే ఒక విప్లవాత్మక చట్టమని మునుగోడు శాసనసభ్యు లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అ న్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన ప్రతిష్టాత్మక భూ భా రతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఉద్దేశించి ఏర్పాటు చేస్తున్న అవగాహన కార్యక్రమాల లో భాగంగా గురువారం నల్గొండ జిల్లా, మునుగోడు నియోజకవర్గ పరిధిలోని మర్రిగూడ మండల కేం ద్రంలో ఏర్పాటు చేసిన భూ భారతి అవగాహన సదసుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
గత ప్రభుత్వం రాత్రికి రాత్రే ఏక పక్షంగా ధరణి పోర్టల్ తీసుకువ చ్చిందని, దీనివల్ల ఎంతోమంది రై తులు వారి సమస్యలను పరిష్క రించుకోలేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. భూమికి ,రైతుకు అవి నాభావ సంబంధం ఉంటుందని, భూమిని నమ్ముకొని దేశంలో ఎం తో మంది బ్రతుకుతున్నారని, అ లాంటి భూములకు సంబంధించిన సమస్యలను తీర్చడంలో గత ప్రభు త్వం రైతులకు తీవ్రమైన అన్యా యం చేసిందన్నారు. ధరణి పోర్టల్ కొద్దిమందిని మాత్రమే దృష్టిలో పె ట్టుకుని చేసిందని, తమ ప్రభుత్వం వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా భూ భారతి వంటి విప్లవాత్మక చట్టాన్ని తెచ్చింది అన్నారు.
భూ భారతి వల్ల 99% సమస్యలు తహసిల్దార్, ఆర్డీవో స్థాయిలో పరి ష్కరించేలా అధికార వికేంద్రీకరణ చేయడం జరిగిందని తెలిపారు. భూముల విషయంలో అన్యాయం జరిగితే సహించేది లేదని, ఎక్కడై నా భూముల విషయంలో రైతుల కు అన్యాయం జరిగినట్లయితే త మ దగ్గరకు రావాలని ఆయన పి లుపునిచ్చారు. రాబోయే రోజుల్లో భూ భారతి చట్టంలో మరిన్ని వేసులుబాట్లు కల్పించి రైతులకు మరింత సులభతరం చేస్తామని తె లిపారు. ముఖ్యంగా రైతులకు భూ ముల విషయంలో ఎలాంటి అపో హాలు ఉండకూడదని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టా న్ని చేయడమే కాకుండా, అందరికీ అవగాహన కల్పించాలని మండలా లలో అవగాహన సదస్సులను ని ర్వహిస్తున్నదని తెలిపారు.
ఈ చట్టం అమలులో భాగంగా ప్రతి గ్రా మానికి ఒక గ్రామ పరిపాలన అధికారిని నియమించనున్నా మ ని, అలాగే లైసెన్స్డ్ సర్వేయర్లను కూడా నియమిస్తున్నామని తెలి పారు. అందరికీ అందుబాటులో ఉండే విధంగా అందరికీ పారదర్శ కంగా ఉండేలా ఈ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని, రైతు లందరూ ఈ చట్టం పట్ల అవగాహ న కల్పించుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శివన్న గూ డెం రిజర్వాయర్ నిర్మిస్తే మునుగో డు నియోజకవర్గంలోని రెండు ల క్షల ఎకరాలకు సాగునీరు అంది స స్యశ్యామలమవుతుందని, అలాం టి ప్రాజెక్టును రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని, ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే తన లక్ష్యమని తెలిపారు. శివన్నగూడెం కింద నాలుగు గ్రామాలు ముంపు నకు గురికాగా, 90 శాతం పురావా సం పూర్తి చేసామని, కేవలం 10 శాతం మాత్రమే మిగిలి ఉందని, 10 శాతం బాధితులకు తప్పనిస రిగా న్యాయం చేస్తామని ఆయన వెల్లడించారు.
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లా డుతూ ధరణిలో పరిష్కారం కానీ ఎన్నో సమస్యలు భూ భారతి ద్వా రా పరిష్కారం అవుతాయని తాను విశ్వసిస్తున్నట్లు తెలిపారు. గతం లో ధరణి ఉన్నప్పుడు మ్యు టేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటే చాలా మందికి కాలేదని, కానీ ఇప్పుడు 30 రోజుల్లో మ్యుటేవేషన్ కాకుంటే 31 రోజు ఆటోమేటిక్ గా మ్యుటేష న్ అవుతుందని తెలిపారు. భూ భారతిలో భూ సమస్యల పరి ష్కా రం కోసం రైతులు కార్యాల యాల చుట్టూ తిరగాల్సిన అవసరం లే దని అన్నారు.రికార్డుల సవరణలు చేసే అవకాశం భూ భారతిలో ఉం దన్నారు. రిజిస్ట్రేషన్ సమయం లోనే భూమిని సర్వే చేయించి మ్యాప్ తో సహా పట్టా పాస్ బుక్ లో ఎక్కించే విధంగా భూ భారతి లో ఉందని తెలిపారు.
రైతుల భూముల సర్వే గురించి ప్రతి రెవిన్యూ విలేజ్ కి నలుగురు లైసెన్స్డ్ సర్వేయర్లను రాష్ట్ర ప్రభు త్వం నియమించనుందని తెలి పారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 31న భూముల వివరాలన్నింటినీ ఆ గ్రామ పరిధిలో ప్రదర్శించడం జ రుగుతుందని, ఎవరైనా ఆ జాబితా ను పరిశీలించిన తర్వాత సవరణ అవసరం ఉంటే దరఖాస్తు చేసుకో వచ్చని తెలిపారు. శివన్న గూడెం నియోజకవర్గం పునరావాస కేంద్రా ల లబ్ధిదారులకు చింతపల్లి లోనే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇస్తా మని ఆమె వెల్లడించారు.
డిసిసిబి అధ్యక్షులు కుంభం శ్రీనివా స్ రెడ్డి, చండూర్ ఆర్డీవో శ్రీదేవి, త హసి ల్దార్ శ్రీనివాస్, మాజీ జెడ్పి టిసిలు, మార్కెట్ కమిటీ చైర్మన్ లు పలువు రు మాట్లాడారు. మాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ అలి వే లు ,ఇతర ప్రజా ప్రతినిధులు, అధి కారులు ,ఈ అవగాహన సదస్సుకు హాజరయ్యారు.