Additional Collector Raj Kumar :ప్రజాదీవెన నల్గొండ :నల్గొండ జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థల) గా గురువారం బాధ్యతలు స్వీకరించిన రాజ్ కుమార్ ను శుక్రవారం గిరిజన అభివృద్ధి అధికారి మూడవత్ ఛత్రు నాయక్ నేతృత్వంలో గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఏవో పార్థసారథి, ఏ టి డి ఓ ఎం. శ్రీనివాసులు, ఏసీఎంఓ డివి నాయక్, వసతి గృహ సంక్షేమ అధికారులు టి. వెంకటేశ్వర్లు, కొల్లు బాలకృష్ణ, ఈ. శేఖర్ రెడ్డి, వై. శ్రీనివాస్ రెడ్డి, ఎం. మహేష్, జూనియర్ అసిస్టెంట్ పాండు, కంప్యూటర్ ఆపరేటర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.