Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

KTR :కేటీఆర్ కీలక వ్యాఖ్య, వరంగల్ సభ వందకు రెండింతలు సక్సెస్

–తెలంగాణలో మళ్ళీ బిఆర్ఎస్దే న న్న సందేశాన్ని ప్రజలు చాటారు
–ప్రభుత్వ అరాచకాలు,అన్యా యాలను రెట్టింపుగా ఎండగడతాo
–ప్రజలకు ధన్యవాదాలు తెలుపు తూ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

KTR :ప్రజా దీవెన, హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సంద ర్భంగా వరంగల్‌లో జరిగిన బహి రంగ సభకు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేసిన తెలంగాణ ప్ర జలకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ సభను విజయవం తం చేయడంలో కీలకపాత్ర వహిం చిన పార్టీ నాయకులకు, కార్యక ర్తలకు కేటీఆర్ ప్రత్యేక ధన్యవా దా లు తెలిపారు. లక్షల సంఖ్యలో ప్ర జలు సభకు హాజరై, కేసీఆర్ నాయ కత్వం పట్ల అచంచలమైన విశ్వా సాన్ని ప్రకటించారని కొనియా డా రు. నిన్నటి సభ ద్వారా భారత రాష్ట్ర సమితి మరోసారి అధికారం లోకి రాబోతోందని స్పష్టమైందని అభిప్రాయపడ్డారు.

దేశ రాజకీయ చరిత్రలో అతిపెద్ద బహిరంగ సభల్లో ఒకటిగా ఈ రజ తోత్సవ సభ నిలిచిపోతుందని కేటీ ఆర్ తెలిపారు. భారత రాష్ట్ర సమి తి ప్రజాబలాన్ని ఈ సభ మరోసారి నిరూపించిందని గర్వంగా పేర్కొ న్నారు. ట్రాఫిక్ నిర్వహణలో రాష్ట్ర పోలీసు యంత్రాంగం విఫలమైన ప్పటికీ, లక్షలాది మంది ప్రజలు ముందే సభ ప్రాంగణానికి చేరుకోవ డం తెలంగాణ ప్రజల నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. భారీ ట్రా ఫిక్ సమస్యలు ఉన్నప్పటికీ, సభ విజయవంతంగా పూర్తి కావడం గ ర్వకారణమని పేర్కొన్నారు.నిన్న జ రిగిన ఈ సమావేశం రజతోత్సవ స మావేశాల కార్యక్రమాలకు కేవలం ప్రారంభమాత్రమేనని ఆయన తెలి పారు.

కేసీఆర్ స్వయంగా “నేనే ముం దుండి పోరాడతాను” అని ప్రక టిం చడంతో భవిష్యత్తులో మరిన్ని ప్ర జా పోరాటాలకు సిద్ధం కావాలని కే టీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్ర భుత్వానికి ఇప్పటికే తగిన సమ యం ఇచ్చామని, ఇకపై ప్రతి అం శంపై ప్రభుత్వాన్ని వెంటాడుతా మని కేటీఆర్ అన్నారు. ప్రజలను చైతన్యపరిచేందుకు, ప్రభుత్వ వైఫల్యాలను, దోపిడీ చర్యలను మీడియా ద్వారా ఎండగట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసే అరాచకాలను, వారి ప్రచారా లను ఎక్కడికక్కడ ఎదుర్కొని ప్రజ ల్లో స్పష్టత తీసుకురావాలని, మ రింత చురుకుగా ముందుకు సాగా లని కేటీఆర్ పిలుపునిచ్చారు.

పార్టీ శ్రేణులకు నాయకులకు ధ న్యవాదాలు .. రాష్ట్ర పార్టీ నాయ కులతో పాటు పార్టీ శ్రేణితో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ ని ర్వహించారు. ఈ సందర్భంగా తె లంగాణ రాష్ట్రం నలుమూలల నుం చి పెద్ద ఎత్తున స్పందించి సభ విజ యవంతం కావడంలో మద్దతు తె లిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తె లిపారు. ఈ కార్యక్రమాన్ని విజయ వంతం చేయడంలో ప్రత్యేక కృషి చేసిన వరంగల్ జిల్లా పార్టీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకు లు, కార్యకర్తలతో పాటు హుస్నా బాద్ మాజీ ఎమ్మెల్యే మరియు పార్టీ కార్యకర్తలకు కూడా కేటీఆర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
సభా ప్రాంగణం వద్ద గత నెల రోజు లుగా నాయకులు, కార్యకర్తలు చే సిన కృషి ఫలితంగా ఈ సభ ఎం తో విజయవంతంగా జరిగిందని కేటీ ఆర్ పేర్కొన్నారు.

నాయకులందరి నిబద్ధత, కృషి వల్లనే ఇంత భారీ సభ ఎలాంటి ఇ బ్బందులు లేకుండా ముగిసిందని ప్రశంసించారు. స్థానిక శాసనసభ ని యోజకవర్గాల ఇన్‌చార్జీలు, జిల్లా అధ్యక్షుల సమన్వయంతో సుదూ ర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి కా ర్యకర్త సురక్షితంగా తమ ఇండ్లకు చేరుకున్నారని, ఇందుకోసం శ్రమిం చిన ప్రతి నాయకునికి, కార్యకర్తకు కేటీఆర్ హృదయపూర్వక ధన్య వాదాలు తెలియజేశారు. క్షేత్రస్థా యి నుంచి పార్టీ కేంద్ర కార్యాల యం వరకు ప్రతి ఒక్కరూ సభ వి జయవంతం కావడానికే పని చేశా రని కేటీఆర్ అభినందించారు.

ఈ భారీ బహిరంగ సభను పక్కా ప్రణాళికతోఎలాంటి అవాంతరా లు లేకుండా విజయవంతం చేయ గలిగామని పేర్కొన్నారు. సభ విజ యవంతం కావడానికి కృషి చేసిన భారత రాష్ట్ర సమితి నాయకుల కు, పార్టీ శ్రేణులకు, దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించిన సీనియర్ నాయకులకు, సోషల్ మీడియా వారియర్లకు కేటీఆర్ హృదయ పూ ర్వక ధన్యవాదాలు తెలిపారు. వీరందరి కృషితో ఈ చారిత్రాత్మక సభ మరువలేని ఘట్టంగా నిలిచిం దని చెప్పారు. అదేవిధంగా, మంచి కవరేజ్తో సభా కార్యక్రమాలను ప్ర జలకు అందించిన మీడియా మిత్రు లకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.