Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MinisterUttamKumarReddy :ఉమ్మడి నల్లగొండ జిల్లాను సస్య శ్యామలం చేస్తాం

–పలు ఎత్తిపోతల పథకాలకు జిల్లా మంత్రుల శంకుస్థాపనలు
–డిండి లిఫ్ట్ ఇరిగేషన్ కు ఎదుల ద్వారా నీరoదించేందుకు సిద్ధం
–నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ వేగవంతంతో అతిత్వరలోనే స్టేజి వన్ సాగునీరు
— తమ హయాంలోనే ఎస్ఎల్బిసిని పూర్తిచేస్తామని సుస్పష్టం
— రాష్ట్ర నీటిపారుదల, పౌరసర ఫ రాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కు మార్ రెడ్డి

MinisterUttamKumarReddy : ప్రజా దీవెన, నల్లగొండ: ఉమ్మడి న ల్గొండ జిల్లాలో చేపట్టిన అన్ని ఇరిగే షన్ ప్రాజెక్టులను పూర్తి చేసి జిల్లా ను సస్యశ్యామలం చేస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసర ఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలి పారు. సోమవారం అయన రాష్ట్ర రోడ్లు, భవనాలు, సి నిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి తో కలిసి నల్గొండ జిల్లా కేంద్రం సమీ పంలోని బక్కతా యి కుంట వద్ద 20 కోట్ల 22 లక్షల రూపాయల అంచనాతో నిర్మించ నున్న బక్కతాయకుంట లిఫ్ట్ ఇరిగే షన్ కు,6 కోట్ల 8 లక్షలు రూపాయ లతో నిర్మించే పునుగోడు ఎత్తిపోతల పథకానికి, 19.95 కోట్ల రూపా యల వ్యయంతో నిర్మించనున్న నర్సింగ్ బట్ల ఎత్తిపోతల పథకాల కు శంకుస్థాపన చేశారు.

అంతేకాక 36 కోట్ల రూపాయల వ్యయంతో జిల్లా కలెక్టర్ కార్యా లయంలో నిర్మిం చనున్న అదనపు బ్లాక్ కు శంకుస్థా పన చేశారు.

పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఫోటో ప్రదర్శనను తిలకించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం న ల్గొండ జిల్లాలో ఎలాంటి ఇరిగేష న్ పనులు చేపట్టలేదని తెలిపారు . ఎన్నో ఏళ్ల నుండి రైతులు ఎదురు చూస్తున్న డిండి లిఫ్ట్ ఇరిగేషన్ కు ఎదుల ద్వారా నీరు అందించేం దుకు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 1800 కోట్ల రూపాయ ల ను మంజూరు చేసి పనులు మొద లుపెట్టామన్నారు. అలాగే హై లెవె ల్ కెనాల్ కు 442 కోట్లు మంజూరు చేశామని ,పిళ్లాయ పల్లి కాలు వ, శివన్న గూడెం నుండి నారాయ ణ పూర్, చౌటుప్పల్ మీదుగా సాగు నీరు అందించేందుకు లిఫ్ట్ ఇరిగేష న్ తప్పనిసరిగా మంజూరు చేస్తా మని ప్రకటించారు.

 

మూసిని పున రుద్ధరణ చేసి ఉమ్మ డి నల్గొండ జిల్లా రైతులకు మేలు చేస్తామన్నారు. తమ హయాంలోనే ఎస్ఎల్బిసిని పూర్తిచేస్తామని తెలి పారు.దున్నపోతుల గండి లిఫ్ట్ ఇరి గేషన్ తో పాటు,మరో నాలుగు లిఫ్ట్ ఇరిగేషన్లు పూర్తిచేస్తామని, అలాగే ఐటిపాముల లిఫ్ట్ పనులు కూడా వేగవంతం చేసి పూర్తి చేస్తా మని హామీ ఇచ్చారు.

నాగార్జునసాగర్ నియోజకవర్గా నికి మేలు చేసే నెల్లికల్ లిఫ్ట్ ఇరిగే షన్ పనులు వేగవంతం చేసి అతి త్వరలోనే స్టేజి వన్ ద్వారా సాగు నీరు ఇస్తామన్నారు. అలాగే రాచ కాలువ పనులు పూర్తి చేస్తామని, గంధమల్ల ప్రాజెక్టును తప్పనిసరిగా పూర్తి చేస్తామన్నారు. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నారాయణ పూ ర్ ,చౌటుప్పల్ కు కాల్వ విస్తరించి నిరందిస్తామన్నారు. పెళ్లిపాకల, గా జుపేట లిఫ్ట్ ఇరిగేషన్ నుచేపట్టి పూర్తి చేస్తామని చెప్పారు. దేవా దుల నుండి తుంగతుర్తికి సాగునీ రు తెస్తామని, ఎస్సారెస్పీ ప్రాజెక్టు ను పునరుద్ధరణ చేసి నీళ్లు పెంచు తామని తెలిపారు.ఇరిగేషన్ ప్రాజె క్టులపై రెండు నెలలకోకసారి సమీ క్షిస్తామన్నారు.

 

తాము అధికారంలోకి వచ్చిన త ర్వాత 66.7 లక్షల ఎకరాలలో 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించామని, యాసంగి ధాన్యం కలుపుకుని మొత్తం 2,80,000 మె ట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించి రికార్డు సృష్టించామని ,స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో పం డించని విధంగా ధాన్యం పండిం చామని, అంతేకాక సన్న ధాన్యం పండించిన రైతులకు 500 రూపా యల బోనస్ ను ఇచ్చామన్నారు. గత ప్రభుత్వం వేలకోట్ల రూపా య లు ఖర్చు చేసి పాలమూరు- రంగా రెడ్డి, సీతారామ ప్రాజెక్టు వంటివి పూర్తి చేయలేదని, అలాగే ఏ ఒక్క రికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేద ని ,రేషన్ కార్డుల పై దొడ్డు బియ్యం ఇచ్చారని, తాము సన్నధాన్యాన్ని ఉచితంగా 85 జనాభాకు ఆరు కేజీ ల చొప్పున ఇస్తున్నామని, ఎక్కువ శాతం జనాభా కు ఉపయోగపడే పథకం సన్నబియ్యం అని అన్నా రు.

అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తామని, రాష్ట్రంలో పండించిన బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నామని, నల్గొండ నుండి ఫిలి ప్పీన్స్ కు బియ్యాన్ని ఎగుమతి చే స్తున్నామని చెప్పారు.

రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమా టోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ 36 కోట్ల రూపాయలతో జిల్లా కలెక్టర్ కార్యా లయం అదనపు బ్లాకుకు శంకు స్థాపన ,సుమారు 50 కోట్ల రూ పాయలతో ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేయడం సంతోష మని తెలిపారు. తాను ఎమ్మె ల్యేగా ఉన్నప్పుడే కలెక్టర్ కార్యాల యం అయిందని, అయితే ప్రస్తు తం ప్రభుత్వ పథకాలు పెరగడం, కార్యాలయాలు పెంపు వల్ల ప్రస్తు తం ఉన్న కలెక్టర్ సరిపోదని,దీనిని దృష్టిలో ఉంచుకుని ఉద్యోగులకు మంచి వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో ఆర్ అండ్ బి శాఖ ద్వా రా 36 కోట్లు రూపాయలు మంజూ రు చేయడం జరిగిందని, 9 నెలల్లో ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తా మని తెలిపారు .ఈ భవన నిర్మా ణం పూర్తయితే ఇది వరకే బయట ఉన్న డీఈఓ ,డిఎంహెచ్ కార్యా లయాలు సైతం జిల్లాబ్ కలెక్టర్ కా ర్యాలయానికి వస్తాయని తెలి పారు.

రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షే మం కోసం సన్న బియ్యం పథకాన్ని ఇస్తున్నదని, ప్రతినెల మొదటి తే దీన ఉద్యోగులకు జీతాలు ఇస్తు న్నామని,దీనితోపాటు, అనేక సం క్షేమ పథకాలు అమలు చేస్తు న్నా మని తెలిపారు. ఆర్ అండ్ బి రహ దారులలో భాగంగా 1600 కోట్ల రూపాయలు మంజూరు చేసామ ని, అవసరమైతే మళ్లీ మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రణాళిక ప్రకారం జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకె ళుతున్నామని తెలిపారు.నల్గొండ పార్లమెంట్ సభ్యులు కుం దూరు రఘువీర్ రెడ్డి మాట్లాడు తూ జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకు వెళ్లేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.

జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లా డుతూ ఉద్యోగులు ఇంటికంటే ఎక్కువ సమయం కార్యాలయం లోనే ఉంటారని, జిల్లా కలెక్టర్ కా ర్యాలయంలో ఆదనంగా నిర్మిస్తున్న అదనపు బ్లాక్ లో 82,000 స్క్వేర్ ఫీట్లు మంచి వెసులుబాటు కల్పి స్తుందని అన్నారు. బ్రాహ్మణ వెల్లే ముల ప్రాజెక్టు కింద 737 ఎకరాలు భూసేకరణ చేయడం జరిగిందని, ఈ ప్రాజెక్టు వల్ల 97,000 ఆయక ట్టు పెరిగిందన్నారు. జిల్లాలో ఆయ కట్టు పెరిగి, ధాన్యం ఉత్పత్తి నాలు గు సార్లు పెరగడం వల్ల సన్నబి య్యాన్ని ఇవ్వగలుగుతున్నా మ ని ,అలాగే మొట్టమొదటి క్రిటికల్ కేర్ యూనిట్ ను నల్గొండ జిల్లా ప్ర భుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఏర్పా టు చేశామని, ఉద్యోగులందరూ చిత్తశుద్ధితో పనిచేయాలని పిలు పునిచ్చారు.

ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడు తూ జిల్లాను ప్రగతి పథంలో తీసు కువెళ్లేందుకు అందరూ చేయూత నందించాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్నబియ్యం, భూ భారతి, రైతు బంధు వంటి పథకాలను సద్విని యోగం చేసుకోవాలని కోరారు.

మరో శాసనమండలి సభ్యులు నెల్లి కంటి సత్యం మాట్లాడుతూ ప్రభు త్వం అమలు చేస్తున్న పథకాలన్నీ పేదవాడికి అందేలా చూడాలని కోరారు.

దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ మాట్లాడుతూ తాము డిం డి ప్రాజెక్టు వస్తుందని కలలో కూడా ఊహించలేదని, దీనివల్ల మూడు లక్షల 50 వేల ఎకరాలకు సాగునీ రు అందుతుందని, నియోజకవర్గం లో చేపట్టిన తక్కిన లిఫ్ట్ ఇరిగేషన్లు కూడా త్వరితగతను పూర్తి చేయా లని, అట్లాగే దేవరకొండలో ఆర్డిఓ, తహసిల్దార్, ఎంపీడీవో కార్యాల యాలతో పాటు, రహదారులను మంజూరు చేసి పూర్తిచేయాలని ఆర్ అండ్ బి శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు.

మునుగోడు శాసనసభ్యులు కోమ టిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడు తూ ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కలిసికట్టుగా జిల్లాను ముందుకు తీసుకెళ్దామని అన్నా రు. అభివృద్ధి పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని,జిల్లా కలెక్టర్ కా ర్యాలయంలో అదనపు బ్లాక్ నిర్మి స్తున్నందుకు శుభాకాంక్షలు తెలి యజేశారు.

నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ రాష్ట్రంలో సన్న బియ్యం పథకం అమలు సాహసోపేత నిర్ణయమని అలాంటి పౌరసరఫరాల మంత్రి జిల్లాలో ఉం డడం సంతోషకరమని అన్నారు.

భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, మి ర్యాలగూడ శాసనసభ్యులు బత్తు ల లక్ష్మారెడ్డి, నాగార్జునసాగర్ శాస నసభ్యులు కుందూరు జయ వీర్ రెడ్డి, తుంగతుర్తి శాసనసభ్యులు మందుల శామ్యూల్ ,డిసిసిబి అ ధ్యక్షులు కుంభం శ్రీనివాస్ రెడ్డి , జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్, ఇ న్చార్జి రెవెన్యూ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజ్ కుమార్, ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ అజయ్ కుమార్, ఉదయ సముద్రం ఎగ్జి క్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి, జవహర్, ఇన్చార్జి డిఆర్ఓ అశోక్ రెడ్డి, జిల్లా అధికారులు, తదిత రులు, ఈ కార్యక్రమంలో పాల్గొ న్నారు. ఈ సందర్భంగా మంత్రులు 5 మంది లబ్ధిదారులకు ఇందిర మ్మండ్ల కింద ఒక్కొక్కరికి లక్ష రూ పాయలు చొప్పున చెక్కులను అం దజేశారు.సాంస్కృతిక సారథి కళా కారులు ప్రభుత్వ అభివృద్ధి సంక్షే మ పథకాలపై ప్రదర్శన ఇచ్చారు.