–ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్
SFI Khammampati Shankar : ప్రజాదీవెన, నల్గొండ: ఎస్ఎఫ్ఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి కంభంపాటి శంకర్ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర 5వ మహాసభలు ఖమ్మం జిల్లా లో ఈనెల 25నుంచి 27వరకు జరిగాయి. ఈ మహాసభల్లో విప్లవాల ఖిల్లా నల్లగొండ జిల్లా నుంచి ఖమ్మంపాటి శంకర్ రాష్ట్ర సహాయ కార్యదర్శి గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర సహాయ కార్యదర్శి కంభంపాటి శంకర్ సోమవారం మీడియాతో మాట్లాడారు. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా శాస్త్రీయ విద్యా విధానం కై బలమైన పోరాటాలు నిర్వహిస్తాం అని అన్నారు. దేశం లో బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూదని ఆరోపించారు. పేద, మధ్యతరగతి విద్యార్థుల చదువులు ముందు పోవాలంటే నూతన జాతీయ విద్యా విధానం కు వ్యతిరేకంగా భవిష్యత్తులో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బలమైన సమరశీల విద్యార్థి ఉద్యమాలను చేపడతామని హెచ్చరించారు.
రాష్ట్రంలో మార్పు కావాలి కాంగ్రెస్ రావాలని ఎన్నికల సందర్భంగా అనేక వాగ్వాదానాలు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి పేద, మధ్యతరగతి విద్యార్థుల స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని అన్నారు. విద్యార్థులతో పెట్టుకున్న ప్రభుత్వాలు బతికి బట్ట కట్టలేదన్న చరిత్రను కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోవద్దని హెచ్చరించారు.విద్యార్థులతో పెట్టుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వ పునాదులు కదులుతాయని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రయివేటు ఇంటర్, డిగ్రీ, బిటెక్ కళాశాలల యాజమాన్యాలు స్వయంగా విద్యార్థుల పరీక్షలు కూడా నిర్వహించ లేమని హుకుం జారీ చేసి ఆందోళన లు చేస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ కు దున్నపోతు మీద వాన కురిసినట్లు వుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం లో, నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు తక్షణమే సోంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర 5వ మహాసభలు ఇచ్చిన స్పూర్తి తో వచ్చే విద్యా సంవత్సరం బలమైన విద్యార్థి ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. నల్లగోండ జిల్లా లో తన తో పాటు జిల్లా అధ్యక్షుడు ఆకారపు నరేష్, కుర్ర సైదా నాయక్, కుంచం కావ్య లు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని, వీరి ఎన్నిక పట్ల ఎస్ఎఫ్ఐ నల్లగొండ జిల్లా కమిటీ హర్షం వ్యక్తం చేసిందని తెలిపారు.