Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Government School District Toppers : పదవ తరగతి ఫలితాలలో జిల్లా టాపర్లుగా నిలిచిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు

Government School District Toppers : ప్రజా దీవేన, కోదాడ:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన పదవ తరగతి ఫలితాలలోప్రభుత్వ పాఠశాల విద్యార్థులు జిల్లా టాపర్స్ నిలిచినట్లు కోదాడ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ మండల విద్యాధికారి సలీం షరీఫ్ ఒక ప్రకటనలో తెలిపారుకోదాడ జడ్పీ బాయ్స్ హై స్కూల్. ప్రభంజనం సృష్టించిందని సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధించి
ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా… అంతకుమించి..

విజయ డంకా మోగించిదని తెలిపారు పీఎం శ్రీ జడ్పీ బాయ్స్ హై స్కూల్ కోదాడ. 571, తాళ్లూరి రేఖ శ్రీ ,
549.. కంపెళ్లి నరేందర్ ,526 ఎండి. అఫిఫా ,517 sk. నహీద ,
510.A. భరత్ నాయక్ ,506 ప్రభు చరణ్ ,506 . వైష్ణవి సాధించారని అలాగే పాఠశాలలోమొత్తం పరీక్ష రాసిన విద్యార్థులు 99 రాయగా వీరిలోఉత్తీర్ణులైన వారు 89 మంది
మొత్తం ఉత్తీర్ణత శాతం 90 సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు
కోదాడ మండల విద్యాధికారి పాఠశాల ప్రధానోపాధ్యాయులు md . సలీం షరీఫ్ ఇన్చార్జి ప్రధాన ఉపాధ్యాయులు డి. మార్కండేయ, జిల్లా సైన్స్ అధికారియాలు దేవరాజు, ఉపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి, బడుగుల సైదులు, జానకిరామ్, బ్రహ్మానందం, సురేషు . జిల్లా టాపర్స్కు ఉత్తీర్ణులకు అభినందనలు తెలియజేశారు.