–జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
District Collector Ila Tripathi : ప్రజాదీవెన, నల్గొండ: రెవెన్యూ శాఖలో పలు హోదాలలో సేవలందించి మంచి అధికారిగా గుర్తింపు పొందిన స్పెషల్ కలెక్టర్ నటరాజ్ అభినందనీయులని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం పదవి విరమణ పొందిన స్పెషల్ కలెక్టర్ పదవి విరమణ సన్మాన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించగా, ఆ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
స్పెషల్ కలెక్టర్ ను శాలువా, బొకే, జ్ఞాపికలతో బహూకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నటరాజ్ ఒక సిన్సియర్ వర్కర్ ఉప ఎన్నికల అధికారిగా మంచి సేవలు అందించారని కొనియాడారు.
ఇంచార్జి రెవెన్యూ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ అశోక్ రెడ్డి, చండూరు ఆర్డీవో శ్రీదేవి, జిల్లా అధికారులు, స్పెషల్ కలెక్టర్ నటరాజు కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.