CM Revanth Reddy :ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ సమగ్రాభివృద్ధి కోసం నూటికి నూరు శాతం శక్తి వంచన లేకుండా పనిచేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సంఘ సంస్కర్త బసవన్న గారి స్ఫూర్తితో ప్రజా ప్రభు త్వం కార్యక్రమాలను అమలు చే స్తోందని చెప్పారు. శ్రీ మహాత్మ బస వేశ్వర 892వ జయంతి సందర్భం గా రవీంద్రభారతిలో జరిగిన కార్య క్రమంలో ముఖ్యమంత్రి ముఖ్య అ తిధిగా పాల్గొన్నారు. ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టివిక్రమార్క, మం త్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సల హాదారులు, ప్రజాప్రతినిధులు హాజ రైన ఈ కార్యక్రమంలో ముఖ్యమం త్రి ప్రసంగం ఆయన మాటల్లోనే
సమాజంలో మార్పుల కోసం 12 వ శతాబ్దంలోనే పునాదులు వేసిన గొ ప్ప సంఘ సంస్కర్త బసవన్న. కుల, మత, లింగ వివక్షల వంటి సమాజ అవలక్షణాలను తొలగించాలని, స మ సమాజాన్ని నిర్మించాలని బసవ న్న ఎనలేని కృషి చేశారు. సమాజం లో బసవన్న గారు, జ్యోతిరావు ఫూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ లాంటి వారు ప్రతి మనిషికి సమానమైన హక్కులు క ల్పించి గౌరవంగా బతకాలని కోరు కున్నారు. ప్రతి మనిషి గౌరవంగా బతకడానికి అవసరమైన ప్రణా ళిక లను రచిస్తూ ప్రభుత్వాలు విధాన పరమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్లాలి. ప్రజా ప్రభుత్వం ఆ కోవలోనే బాధ్యతతో ప్రజల దగ్గ రికెళ్లి సమస్యలు తెలుసుకుని హా మీలను అమలు చేసే ప్రయత్నం చే స్తోంది.
దేశంలోనే తొలి రాష్ట్రంగా తెలంగా ణలో బీసీ కులగణన చేశాం. ఎస్సీ వర్గీకరణ పూర్తి చేశాం. వీటన్నిటినీ పకడ్బందీగా అమలు చేస్తాం. అం దుకు అందరి నుంచి సంపూర్ణమైన మద్దతు ఉండాలి. నిరుపేదలకు సన్నబియ్యం, ఆడబిడ్డలకు ఉచిత బస్సు సౌకర్యం, పేదవారికి ఇండ్లు, 200 యూనిట్ల వరకు ఉచిత కరెం టు, రూ. 500 లకే సిలిండర్ అం దివ్వడంతో పాటు 60 వేల ప్రభు త్వ ఉద్యోగాలను ఇచ్చాం. రాష్ట్రా నికి 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం. హైదరాబాద్ నగరాన్ని వి స్తరించడానికి అవసరమైన అభి వృద్ధి కార్యక్రమాలు చేపడుతు న్నాం.
బసవన్న స్ఫూర్తిగా ప్రజాస్వామిక విలువలు కాపాడాలి. ప్రజలు మె చ్చే విధంగా పరిపాలన అందిం చాలి. ప్రజల సంక్షేమం కోసం, అభి వృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చే యాలి. బసవేశ్వరుడి స్పూర్తితో నడుస్తున్న ఈ ప్రభుత్వం, భవిష్య త్తులోనూ అదే మార్గంలో నడుస్తుం ది. వీరశైవ లింగాయత్ ల సంక్షే మం, అభివృద్ధి కోసం వారిచ్చిన విజ్ఞాపనలను పరిశీలించి ప్రభు త్వం నిర్ణయం తీసుకుంటుంది. నేను మాట ఇచ్చానంటే నూటికి నూరు శాతం అమలు చేస్తా. రాబో యే పదేళ్ల పాటు తెలంగాణ ప్రజల కు జనరంజకమైన పరిపాలన అం దిస్తాం. ప్రభుత్వం చేస్తున్న కార్యక్ర మాలకు విద్యార్థినీ విద్యార్థులే వా రధులుగా ముందుండి గ్రామాల్లో ప్రజలకు చేరవేయాలి. విద్యార్థుల భవిష్యత్తు కోసం శక్తి వంచన లే కుండా పనిచేస్తామని ముఖ్యమం త్రి చెప్పారు.