Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

TUWJ : చండూరులో ప్రజాప్రతిభ పత్రికా కార్యాలయo

--ప్రారంభించిన టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు గుండగోని జయ శంకర్ గౌడ్

TUWJ :;ప్రజా దీవెన, చండూరు : ప్రజా ప్ర తిభ దినపత్రిక నల్లగొండ జిల్లా కా ర్యాలయాన్ని మునుగోడు నియో జకవర్గంలోని చండూరు మండల కేంద్రంలో ఆదివారం టీయూడ బ్ల్యూజే జిల్లా అధ్యక్షులు గుండగో ని జయశంకర్ గౌడ్ ప్రారంభిoచా రు. చండూరు లోని శ్రీ సాయి దుర్గ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవానికి ఆ యన ముఖ్య అతిథిగా హాజరై ప్రా రంభించా రు.

ప్రజా ప్రతిభ దిన పత్రిక నల్లగొండ జిల్లా బ్యూరో ఇన్చార్జ్ ఇరిగి సుధా కర్ కుటుంబ సభ్యులు తొలుత గుమ్మడికాయ కొట్టి పూజా కార్యక్ర మాలు నిర్వహించారు. ఆ తర్వాత టీయూడబ్ల్యూ జే నల్లగొండ జిల్లా అధ్యక్షులు గుం డగోని జయశంకర్ గౌడ్ రిబ్బన్ కట్ చేసి లాంఛ నoగా కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం నూతన ప్రజా ప్రతిభ దినపత్రిక కార్యాలయాన్ని ప్రారంభించడానికి వచ్చిన జిల్లా అధ్యక్షులు గుండగోని జయ శంకర్ గౌడ్ ప్రజా ప్రతిభ దినపత్రిక నల్లగొండ బ్యూరో ఇన్చార్జ్ ఇరిగి సుధాకర్ శాలువా కప్పి ఘనంగా స త్కరించారు.

ఈ సందర్భంగా జిల్లా యూనియన్ అధ్యక్షులు జయశంకర్ గౌడ్ మా ట్లాడుతూ పత్రికా కార్యాలయాన్ని ప్రారంభించడం సులువుగానే ఉం టుందని, కానీ ప్రస్తుత పరిస్థితు లలో కార్యాలయాన్ని నిర్వహిం చ డం కష్టంతో కూడుకున్నపని అని, ప్రత్యామ్నాయ మార్గంలో ఆ దా యం సంపాదించుకుంటేనే జీవితంలో రాణించడం సాధ్యమ వుతుం దని చెప్పారు. విరిగి సుధాకర్ ప్రైవేటుగా అధ్యాపక వృత్తిలో ఉన్నం దున ఇతరేతర ఆదా య మార్గాలు అనేషించుకొని ఆదాయంతో పా టు, జర్నలిజం వృత్తి కి న్యాయం చేసే అవకాశం ఉంటుందని సూ చించారు.

ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే -143 జిల్లా కార్యదర్శి గాలెంక గురుపాదం, టీయూడబ్ల్యూజే ఆర్గనైజింగ్ సెక్రటరీ, జనంసాక్షి నల్ల గొండ జిల్లా బ్యూరో ఇన్చార్జ్ అంజయ్య, ముంగోడు నియోజకవర్గ అధ్యక్షులు సతీష్ గౌడ బి.సతీష్ గౌడ్, జర్నలిస్టులు శంకర్, రవి, గిరి, ఇరిగి యాదయ్య, దేవా, సురేష్, కుటుంబ సభ్యులు ఇరిగి నర సిం హ, శాంతమ్మ, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.