నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం
Smile and Health :ప్రజాదీవెన, సూర్యాపేట :నవ్వుతో సర్వ రోగాలను దూరం చేయవచ్చు అని నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగమని సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రం యోగా గురువు చాడ పాపిరెడ్డి తెలిపారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రంలో ప్రపంచ నవ్వుల దినోత్సవం ను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముందుగా “లాఫింగ్ యోగ సేవ క్లబ్” ఏర్పాటు చేసి ప్రోహత్సహిస్తున్నటువంటి మరికంటి వెంకట్ ఖమ్మం వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నవ్వడం ద్వారా శరీరంలో కండరాలు,నరాలు, అవయవాలు ఉత్తేజితం పొందుతాయన్నారు.
దీర్ఘకాల వ్యాధులతో బాధపడేవారికి నవ్వు దివ్య ఔషధంలా, చికిత్సలా పనిచేస్తుందని,జీవితంలో ఎక్కువగా నవ్వడం వల్ల సగటున ఏడేళ్లు ఆయుస్సు పెరుగుతుందనీ తెలిపారు.దుష్ప్రభావాలను తగ్గించడంలో పాటు రక్త సరఫరా మెరుగు పరచడానికి, ఉత్సాహాన్ని పెంపొందించడానికి నవ్వు తోడ్పడుతుందనీ తెలిపారు. మనిషి సంతోషానికి, ఆనందానికి సహజమైన వ్యక్తికరణ నవ్వుఅని, మన నుంచి వచ్చే చిరునవ్వు ఎదుటివారిని ఆకర్షించుటమే కాకుండా శత్రువుకు సైతం కోపాన్ని తగ్గిస్తుందని తెలిపారు. ఈ సృష్టిలో పైసా ఖర్చు లేనిది చిరునవ్వు మాత్రమే నని, నవ్వుతూ 10 మందిని నవ్విస్తుంటే ఏ సమస్యలు రావని పెద్దలు చెప్తారనీ తెలిపారు. మీరు నవ్వడం వల్ల మీ చుట్టూ ఉన్న వారికి ఆరోగ్యకరమైన సమాజాన్నీ ఇవ్వగలుగుతారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంత్ నిరంకార్ సంస్థ జిల్లా అధ్యక్షురాలు కడారి,సరళ ప్రతిభ కాలేజ్ కరస్పాండెంట్ వెంకట్ రెడ్డి, మల్లారెడ్డి, సుధాకర్, సుదర్శన్ రెడ్డి,మమత, కళ్యాణి, గోరంట్ల శ్రీనివాస్, కే సైదులు, పద్మ,శ్వేత, ఓ, లింగయ్య, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనాథ్, త్రిశూల, రవీంద్ర చారి, దివ్య, తదితరులు పాల్గొన్నారు..