Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CPI Village Department Control : గ్రామశాఖ లే సిపిఐ పార్టీకి పట్టుకొమ్మలు:: బత్తినేని హనుమంతరావు

CPI Village Department Control  :ప్రజా దీవెన, కోదాడ: గ్రామాలలో గ్రామ శాఖలేల కమ్యూనిస్టు పార్టీ బలోపేతానికి పట్టుకొమ్మ లాంటివని కోదాడ మండల సిపిఐ కార్యదర్శి.బత్తినేనిహనుమంతరావు అన్నారు కోదాడ మున్సిపల్ పరిధిలోని తమ్మర బండ పాలెం గ్రామంలో స్థానిక బత్తినేని శ్రీనివాసరావు నివాస గృహములో సిపిఐ నాయకులు కొండా కోటేశ్వరరావు అధ్యక్షతన గ్రామ శాఖ సమావేశాన్ని నిర్వహించారు .

 

ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ తమ్మర గ్రామంలో కమ్యూనిస్టు పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సైనికులు పని చేయాలని పిలుపునిచ్చారు రానున్న స్థానిక ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీ గెలుపుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు అనంతరం తమ్మర గ్రామ శాఖ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు గ్రామ శాఖ అధ్యక్షులుగా మాతంగి ప్రసాద్, సహాయ కార్యదర్శిగా రాయపూడి కాటమరాజు, కోశాధికారిగా అల్వాల గురవయ్య లను ఎన్నుకున్నారు అలాగే అల్వాల్ పురం గ్రామ శాఖ కార్యదర్శిగా గోసు నగేష్ ను కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు ఈ సమావేశంలో పోతురాజు సత్యనారాయణ కంబాల స్వామి గొటిముక్కల కోటి నారాయణ నిడిగొండ రామకృష్ణ, సయ్యద్ నాగులమీరా, మాతంగి గాంధీ ,సుందరయ్య , నిడిగొండ రాంబాబు, ఎల్లయ్య,సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు