Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Sri Varavara Ranganayaka Temple Land Lease :శ్రీ వరవర రంగనాయక దేవాలయ భూముల కౌలు వేలం పాటలు

Sri Varavara Ranganayaka Temple Land Lease :ప్రజా దీవెన, కోదాడ: కోదాడ మండల పరిధిలోని గణపవరం గ్రామంలో వేంచేసియున్న శ్రీ వరవర రంగనాయక దేవాలయ భూముల కౌలు వేలం పాటలు బుధవారం దేవాలయములో మిర్యాలగూడెం దేవాలయాల పర్వేక్షణాధికారి పి ఏడుకొండలు దేవాలయ ఈవో తుమ్మల వెంకట చలపతి ఆధ్వర్యంలో నిర్వహించారు .

దేవాలయం క్రింద ఉన్న 16 ఎకరాల 16 కుంటల భూమిని సంవత్సరం కౌలు ఐదు లక్షల 30 వేల రూపాయలకు కుక్కడకు ప్రవీణ్ వేలం లో దక్కించుకున్నారు అలాగే దేవాలయం కింద ఉన్న మరో ఆరు ఏకరాల ఆరుకుంటల భూమిని సంవత్సరం కౌలు కింద 75 వేల రూపాయలకు సుల్తాన్ని రాంబాబు వేలంలో దక్కించుకున్నాడు దేవాలయ కమిటీ చైర్మన్ ఇర్ల లక్ష్మారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ వేలంపాటలో పాలకవర్గ సభ్యులు సాయిని సీతయ్య, బల్గూరి సైదులు, కంపసాటి నాగరాజు ,ఉల్లి నాగమణి, నిరుడు బిక్షం కుక్కడపు గురవయ్య, దేవాలయ ప్రధాన అర్చకులు నల్లాదీగ కృష్ణమాచార్యులు గ్రామ పెద్దలు రైతులు తదితరులు పాల్గొన్నారు