CMRevanthReddy : ప్రజా దీవెన, హైదరాబాద్: భారత సార్వ భౌమాధికారం వైపు కన్నెత్తి చూసినా అలాంటి వారికి ఈ భూమి మీ ద నూకలు చెల్లినట్టేనని తెలంగాణ ముఖ్యమంత్రి నిర్మల రేవంత్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. భారతీయ వీర జవాను లకు 140 కోట్ల దేశ ప్రజల మద్ద తుందని, మా వీర జవానులు తలు చుకుంటే ప్రపంచ పటంలో మీ ఉని కి లేకుండా చేయగలరని రేవంత్ రెడ్డి ఉగ్ర వాదులను హెచ్చరించారు.భారతీయ సైన్యం ప్రారంభించిన ఆ పరే షన్ సిందూర్ను ఎవరూ ఆప లేరని, భారతదేశ రక్షణ కోసం మే మంతా ఒక్కటే, వీర జవానులు ఏ చర్య తీసుకున్నా అందుకు మద్ద తుగా వారి వెంట నడవడానికి తె లంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నార ని చెప్పారు.
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భా రత సైన్యానికి సంఘీభావంగా డాక్ట ర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివా లయం నుంచి ఇందిరాగాంధీ విగ్ర హం వరకు ముఖ్యమంత్రి ముం దుండి ర్యాలీ నిర్వహించారు.
నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం వద్దకు చేరుకుని పహల్గా మ్ ఉగ్రవాదుల దాడిలో మరణిం చిన వారి చిత్రపటాలకు ఉప ము ఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కతో కలిసి పుష్పాంజలి ఘటించారు. అ నంతరం మాట్లాడారు. సీఎం ప్రసం గం ఆయన మాటల్లోనే…
వీర జవానులకు దేశం అండగా ని లబడుతుందని ఉగ్రవాద ప్రేరేపిత పాకిస్తా న్కు గట్టిగా హెచ్చరించా రు. భారత వీర జవానులకు దేశ ప్ర జలందరూ అండగా ఉన్నామని, భారత దేశ సార్వభౌమాధికారం మీ ద ఎవరు దాడి చేసినా వారిని వద లిపెట్టబోమనే సందేశాన్ని ఈ తెలం గాణ గడ్డమీద నుంచి ఇవ్వడానికే ఈ ర్యాలీ నిర్వహించామని చెప్పా రు.
భారత వీర జవాన్లకు అండగా నిల బడి, వారికి ఒక స్ఫూర్తిని ఇవ్వడా నికి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళా ల ప్రతినిధులు, మాజీ ఆర్మీ అధికా రులు, రాష్ట్ర పోలీసు అధికారులు, సచివాలయ ఉద్యోగులంతా వేలా దిగా ఈ సంఘీభావ ర్యాలీకి తరలి వచ్చి మన సైనికులకు అండగా ని లిచినందుకు అందరికీ అభినంద నలు.
పాకిస్తాన్ ఉగ్రవాదులకు, పాకిస్తాన్ పాలకులతో పాటు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి ఈ దేశ సార్వభౌమా ధికారంపై దాడి చేయాలనుకున్న ప్రతి ఒక్కరికీ ఈ ర్యాలీ ద్వారా హె చ్చరిస్తున్నాం. మా వైపు కన్నెత్తి చూసినా ఈ భూమి మీద మీకు నూకలు చెల్లినట్టే. ఈ భూమి మీద నివసించడానికి మీరు అర్హత కో ల్పోయినట్టే.
శాంతి ద్వారానే బ్రిటిష్ పాలన నుం చి విముక్తి పొందాం. పాకిస్తాన్ కు సైతం స్వతంత్రం వచ్చిందంటే అ మరుడైన మహాత్మాగాంధీ శాంతి యుత పోరాటం వల్లే. అమరుడైన మహాత్మాగాంధీ శాంతి సిద్ధాంతాన్ని పునికి పుచ్చుకున్న 140 కోట్ల భార తీయులు ప్రపంచంలో శాంతిని కో రుకుంటూ అభివృద్ధి పథం వైపు దే శాన్ని నడిపించాలని కోరుకుంటు న్నారు. భారతదేశం ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా, ఒక గొప్ప స్ఫూ ర్తినిచ్చే దేశంగా నిలబెట్టాలని కోరు కుంటున్నారు.
మా శాంతిని, మా శాంతి ఆకాంక్ష ను, చేతగాని తనంగా ఎవరైనా భా విస్తే, మా భూ భాగంలో కాలుమోపి మా ఆడబిడ్డల నుదిటి సిందూరా న్ని తుడిచివేయాలని అనుకుంటే వారిని నేలమట్టం చేసే శక్తి మా వీర సైనికులకు ఉంది. వారికి 140 కోట్ల భారతీయులు అండంగా నిలబడు తారని, జై హింద్” అంటూ ముగిం చారు.
ఈ ర్యాలీలో మంత్రివర్గ సహచ రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎ మ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శి, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కు చెందిన ప్రతినిధులు, మాజీ అధికా రులు పెద్ద ఎత్తున పాల్గొని సంఘీ భావం ప్రకటించారు.